janaki kalaganaledu 28 february 2022 full episode
Janaki Kalaganaledu 28 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 246 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ కేకుల ఆర్డర్ తీసుకుంటుంది. ఉదయానికల్లా 7 కేకులు కావాలని జానకిక చెబుతుంది జ్ఞానాంబ. నువ్వు శ్రమ అనుకోకుండా.. రాత్రి ఎంత సమయం అయినా సరే కేకులు తయారు చేయడం పూర్తి చేయి అంటుంది జ్ఞానాంబ. నువ్వు సమయానికి కేకులు తయారు చేయకపోతే పుట్టినరోజు వేడుకలు ఆగిపోతాయి. అందకే.. ఆలస్యం చేయకుండా ఇప్పుడే కేకులు తయారు చేయడం మొదలుపెట్టు అని అంటుంది జ్ఞానాంబ. జానకి గారు ఒక్కరే అంటే జానకి గారు చేయడానికి ఇబ్బంది పడతారేమో.. జానకి గారితో పాటు నేను కూడా కేకులు తయారు చేస్తాను అంటాడు రామా. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 28 february 2022 full episode
జ్ఞానాంబ వెళ్లిపోయాక.. జానకి టెన్షన్ పడుతున్నారు ఎందుకు అని అంటాడు రామా. అది కాదండి.. అత్తయ్య గారు అంటూ ఏదో చెప్పబోతుంది జానకి. నేను ఉన్నాను కదా.. నేను చూసుకుంటాను అంటాడు రామా. ముందు.. తనను బండి మీద రాజమండ్రికి క్లాస్ కు తీసుకెళ్లబోతుంటాడు. మీరు క్లాస్ కు వెళ్లండి.. మీరు వచ్చేలోపు నేను కేకుకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొస్తాను. ఆ తర్వాత ఖార్ఖానాకు వెళ్లి మనం కేకులు రెడీ చేద్దాం అంటాడు. బండి మీద వెళ్తుండగా ఇంతలో మధ్యలో బైక్ పంక్చర్ అవుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు జానకికి. ఇంతలో ఆటో వస్తుంది. రాజమండ్రి వెళ్తున్నా. ఎవరైనా వస్తారా అని ఆటో డ్రైవర్ అడుగుతాడు. దీంతో ఏమండి.. నేను ఆటోలో రాజమండ్రి వెళ్తాను అంటుంది జానకి. దీంతో జానకిని ఆటోలో పంపిస్తాడు రామా. ఆటోలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది జానకి.
ఆటో డ్రైవర్ మాత్రం జానకినే గమనిస్తూ ఉంటాడు. కొంతదూరం వెళ్లాక.. ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి ఆటోను తీసుకెళ్లి ఆటో ఆపుతాడు ఆటో డ్రైవర్. దీంతో ఏమైంది అని జానకి కిందికి దిగుతుంది. ఇక్కడెందుకు ఆపారు అంటుంది. దీంతో మర్యాదగా నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఇచ్చి.. మర్యాదగా నడుచుకుంటూ వెళ్లిపో అంటాడు ఆటో డ్రైవర్.
మరోవైపు వెన్నెల.. దిలీప్ తో మాట్లాడుతుండగా.. మల్లిక చూస్తుంది. ఓయమ్మో.. ఏందబ్బా ఇది. ప్రేమించిన వాడు దూరమైనా.. ఇంత సంతోషంగా ఉందేంటి. జానకి చూసిన సంబంధానికి.. ఈ పిల్ల హ్యాపీగా ఉండటానికి ఏదో లింక్ ఉంది. కనిపెడతా.. అన్ని లింకులు కనిపెడతా అనుకుంటుంది మల్లిక.
మరోవైపు రామా.. జానకి చెప్పిన మైసమ్మ దేవాలయం దగ్గరకు వస్తాడు. కానీ.. అప్పటికీ జానకి అక్కడికి రాదు. దీంతో వెంటనే తనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో ఏం చేయాలో రామాకు అర్థం కాదు. అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ ను ఆపి ఈవిడను చూశారా అని అడుగుతాడు రామా. దీంతో చూడలేదు అంటారు.
ఏం చేయాలో రామాకు అర్థం కాదు. దీంతో అక్కడి నుంచి బండి మీద వెళ్తాడు రామా. అన్ని చోట్ల వెతుకుతాడు కానీ.. జానకి కనిపించదు. తిరిగి అదే గుడి దగ్గరికి వస్తాడు. అక్కడే జానకి వెయిట్ చేస్తూ ఉంటుంది. జానకి గారు.. ఇంత లేట్ అయింది ఏంటి.. మీకోసం ఎంత వెతికానో తెలుసా. మీ ఫోన్ కలవట్లేదు అని అంటాడు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. క్లాస్ పావుగంట లేట్ అయింది అంటుంది జానకి.
ఆ ఆటో డ్రైవర్ మీద మీకు వచ్చిన అనుమానం నిజమే రామా గారు అంటుంది. నువ్వు రౌడీ వెదవలా ఉన్నావని మా ఆయన చెప్పినా సరే నేను ఆటో ఎక్కాను ఎందుకో తెలుసా? నా ధైర్యం మీద నాకు ఉన్న నమ్మకం అంటుంది జానకి. వెంటనే కిందికి వంగి మట్టి తీసి అతడి కళ్లలో కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. అదే విషయాన్ని రామాకు చెబుతుంది.
మరోవైపు గోవిందరాజు ఊరి నుంచి వస్తాడు. జ్ఞానం నేను వచ్చేశా అంటాడు. అత్తయ్య గారు ఎలా ఉన్నారు అంటుంది. దీంతో బాగుంది జ్ఞానం. కానీ.. వెన్నెల నిశ్చితార్థం ఆగిపోయేసరికి అమ్మ బాధపడింది అంటాడు గోవిందరాజు. జానకి సంబంధం చూసిన విషయం కూడా చెప్పా అంటాడు.
ఇంతకుముందు సంబంధం చూసిన విషయంలో వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిశ్చితార్థం దాకా తీసుకొచ్చి ఇంటి పరువు పోగొట్టారు. ఈసారి కూడా గుడ్డిగా ప్రవర్తించి మరోసారి పరువు తీయకండి అని అమ్మ గట్టిగా చెప్పింది అంటాడు గోవిందరాజు.
దీంతో ఈసారి అలా కాదు లేండి. జానకి మీద నాకు నమ్మకం ఉంది. మన జానకి చూసిన ఈ సంబంధం.. మన వెన్నెలకు నూటికి నూరు పాళ్లు సరైన సంబంధం అంటుంది జ్ఞానాంబ. అమ్మ.. ఇంకో షరతు కూడా పెట్టింది. ఒక్కగానొక్క మనవరాలు కాబట్టి.. వెన్నెల నిశ్చితార్థం అక్కడే జరగాలని పట్టుబట్టింది అంటాడు గోవిందరాజు.
దీంతో సరేనండి.. అలాగే.. అక్కడే జరిపిద్దాం అంటుంది జ్ఞానాంబ. మరోవైపు ఖార్ఖానాకు వెళ్లి కేకుల తయారీలో నిమగ్నమై ఉంటారు రామా, జానకి. అప్పుడే కరెంట్ పోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు జానకికి. అబ్బా ఇప్పుడు కరెంట్ పోయిందేంటి.. రేపు ఉదయం కల్లా కేకులు తయారు చేసి ఇవ్వాలి.. అని టెన్షన్ పడుతూ ఉంటుంది జానకి.
కంగారు ఎందుకు దండగ.. మీ చెంత ఈ రామచంద్ర ఉండగా.. అంటాడు రామా. ఆగండి.. అని చెప్పి లాంతర్ వెలిగిస్తాడు రామా. దీంతో కేకు తయారీ మొదలు పెడుతుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
This website uses cookies.