Business idea : లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం పోతుందనే భయంతో ఆర్గానిక్‌ స్ట్రాబెర్రీని పండించి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business idea : లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం పోతుందనే భయంతో ఆర్గానిక్‌ స్ట్రాబెర్రీని పండించి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?

Business idea : ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కొవిడ్‌ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విధించిన లాక్ డౌన్‌ తెచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ వైరస్‌ ప్రభావం చాలా దేశాలపై తీవ్రంగా ఉంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. పేద దేశాల నుండి అగ్ర రాజ్యాల వరకు కరోనాతో విలవిల్లాడాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గినా.. అది చూపించిన ప్రభావం మాత్రం ఇంకా తొలగిపోలేదు.ఈ […]

 Authored By jyothi | The Telugu News | Updated on :28 February 2022,12:00 pm

Business idea : ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కొవిడ్‌ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విధించిన లాక్ డౌన్‌ తెచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ వైరస్‌ ప్రభావం చాలా దేశాలపై తీవ్రంగా ఉంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. పేద దేశాల నుండి అగ్ర రాజ్యాల వరకు కరోనాతో విలవిల్లాడాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గినా.. అది చూపించిన ప్రభావం మాత్రం ఇంకా తొలగిపోలేదు.ఈ సంక్షోభంలో చాలా రంగాలను తీవ్ర నష్టాలకు గురి చేసింది. లాక్ డౌన్ సమయంలో పలు కంపెనీలు, సంస్థలు మూత పడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి… జీవితం గడవక ఎన్నో ఇబ్బందులు పడటం కళ్లారా చూశాం. అయితే.. కరోనా పలు రంగాలకు ఎంతో మేలు కూడా చేసింది. ఎన్నడూ లేనంత లాభాలు సాధించాయి. ఉన్నట్టుండి బిజినెస్‌ అమాంతం పెరిగి పోయింది. అయితే కరోనా సంక్షోభంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడగా.

మరికొందరు మాత్రం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి… మంచి లాభాలు సంపాదించారు.అచ్చంగా ఇలాంటి పరిస్థితి వారణాసికి చెందిన రమేష్‌కు వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగం పోతుందన్న భయమే.. ఇప్పుడు ఆయనను లాభాల బాట పట్టించే సాగు వైపు తీసుకెళ్లింది. ఇప్పుడు లక్షలకొద్దీ సంపాదిస్తున్నాడు.ఒక ప్రైవేటు పాఠశాలలో రిసోర్స్ మేనేజర్‌గా పని చేసే రమేష్‌.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయి పరిస్తితుల్లోకి నెట్టి వేయబడ్డాడు. ఉన్న ఉపాధి మార్గం పోతే ఎలా భావించిన రమేష్‌… మరో ఆదాయ మార్గం గురించి వెతకడం ప్రారంభించాడు. అదే సమయంలో తన స్నేహితునితో కలిసి రెండెకరాల భూమిలో సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను సాగు చేయాలని భావించాడు. కానీ వారికి ఎలాంటి అనుభవం లేదు. అయినా ముందుకే అడుగు వేశారు. ఇంటర్‌నెట్‌లో శోధించారు. వర్క్‌షాపులకు అటెండ్‌ అయ్యారు. స్ట్రాబెర్రీలను పండిస్తున్న ఎందరో రైతులను కలిసి సాగు మెలకువలను నేర్చుకున్నారు.

Business idea varanasi organic strawberry farming lockdown unemployment lakhs

Business idea varanasi organic strawberry farming lockdown unemployment lakhs

స్ట్రాబెర్రీలు పండటానికి చల్లని వాతావరణం కావాలని.. వారణాసిలో అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం ఉంటుందని గుర్తించారు. కొత్త కొత్త పద్దతులను అవలంభిస్తూ సాగు చేపట్టారు. డిప్‌ ఇరిగేషన్‌తో పాటు నీటి సంరక్షణ పద్ధతులు పాటించారు. క్రమంగా వారి కష్టానికి ఫలితం రావడం మొదలైంది. అది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు ఒక మొక్క నుంచి సగటున 500 గ్రాముల పండ్లు దిగుబడి వస్తోంది. రెండెకరాల పొలంలో 15 వేల మొక్కలు పెంచుతున్నారు. ఒక కిలో స్ట్రాబెర్రీ సగటున రూ. 200కి అమ్ముడవుతోంది. ప్రస్తుతం, రమేష్ అతని స్నేహితుడు మదన్ మొదటి పంట చివరి దశలో ఉన్నారు. పంట చేతికొచ్చి అమ్ముడు పోతే వారికి దాదాపు రూ. 5 లక్షల కంటే ఎక్కువే ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అంటే వారి నెలవారీ ఆదాయం లక్షకు పైగానే ఉంటుంది.రమేష్‌, మదన్‌ ఇద్దరు కలిసి వారి పొదుపు నుంచి దాదాపు రూ. 9 లక్షలు రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వారు పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది