Categories: BusinessNews

Business Idea : ఈ బిజినెస్ చేశారంటే రూ.2 లక్షల పెట్టుబడితో.. ప్రతినెలా లక్ష ఆదాయం పొందవచ్చు..

Business Idea : ఇప్పుడు చాలామంది సొంత బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఒకరి కింద కష్టపడి పనిచేసే బదులు తామే సొంతంగా వ్యాపారం పెట్టుకొని కష్టపడితే తమకే డబ్బులు మిగులుతాయి కదా అని ఆలోచిస్తుంటారు. కరోనా వచ్చాక చాలామంది తమ ఉపాధులను కోల్పోయారు. ఈ క్రమంలో కొందరు సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎటువంటి వ్యాపార ప్రారంభించాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందగలిగే బిజినెస్ ఐడియా ఉంది. అదే ఫ్లై యాష్ బ్రిక్స్ బిజినెస్ బూడిదతో తయారు చేయబడిన ఇటుకలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.

మీరు కనుక ఈ బిజినెస్ చేశారంటే అతి తక్కువ సమయంలో లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు. బ్రిక్స్ వ్యాపారానికి రాబోయే కాలంలో డిమాండ్ బాగా పెరగబోతుంది. వేగవంతమైన పట్టణీకరణ కాలంలో బిల్డర్లు ఇప్పుడు బూడిదతో చేసిన ఇటుకలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బిజినెస్ చేయటానికి 100 గజాల స్థలం కావాలి. కనీసం రెండు లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇటుకలను బూడిద, సిమెంట్ మరియు రాతి దూళి మిశ్రమం నుండి తయారు చేస్తారు. ఈ ఇటుకల తయారీకి ఉపయోగించే మాన్యువల్ యంత్రాన్ని 100 గజాల స్థలంలో సౌకర్యంతంగా అమర్చవచ్చు. ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. యంత్రాన్ని నడపడానికి 5 నుండి 6 మంది వ్యక్తులు అవసరం.

Business Idea with an investment of Rs.2 lakh, the income is one lakh per month

దీనివలన ప్రతిరోజు సుమారుగా 3000 ఇటుకల తయారవుతాయి. మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టగల స్తోమత ఉంటే ఆటోమేటిక్ మిషన్ ను కూడా అమర్చవచ్చు. ఈ యంత్రం ధర 10 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు యంత్రం ద్వారానే పనులు జరుగుతాయి. ఆటోమేటిక్ యంత్రం గంటకి 1000 ఇటుకలను తయారు చేస్తుంది. ఈ విధంగా మీరు ఒక నెలలో మూడు నుండి నాలుగు లక్షల ఇటుకలను సులువుగా తయారు చేయవచ్చు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మట్టి లేని కారణంగా ఇటుకలు తయారు చేయడం లేదు. ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి ఇక్కడికి ఇటుకలు దిగుమతి అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటుకలను ఆయా ప్రాంతాల్లో అమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. దీని వలన ఎక్కువ రాబడిని పొందవచ్చు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago