
7th Pay Commission
Business Idea : కరోనా వచ్చాక చాలామంది తమ ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు. అయితే కరోనా కొత్త కొత్త వ్యాపారాలను సృష్టించింది. ముఖ్యంగా ఆన్ లైన్ సేవలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలు అన్ని రకాల వస్తువులను ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలు, పండ్లు తదితర వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. జొమాటో, స్విగ్గి లాంటి సంస్థలు ఆన్లైన్ ఫుడ్ వ్యాపారాలు ప్రారంభించాయి. అయితే ఆన్లైన్లో టిఫిన్ కు మాత్రం ఆశించినంతగా ఆర్డర్లు ఉండడం లేదు. దీనికి కారణం టిఫిన్ ధర బయట చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆన్లైన్లో వీటిని ఆర్డర్ చేస్తే సర్వీస్ చార్జెస్ కలిపి మొత్తం ధర ఎక్కువ అవుతుంది.
ఈ క్రమంలో సామాన్యులు టిఫిన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో మీరు కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే ఆన్లైన్ టిఫిన్ బిజినెస్ ప్రారంభించడం మంచి ఐడియా అని చెప్పవచ్చు. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. కేవలం 5వేలు, 10వేలు పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కాకపోతే ఈ బిజినెస్ కు పబ్లిసిటీ చేయడం చాలా అవసరం. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు, యూపీఐ ద్వారా బిల్ ను తీసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ కోసం మంచి వంట మాస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. టూ వీలర్ ఉంటే డెలివరీలు కూడా చేయవచ్చు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ డెలివరీ చేయడానికి బాయ్స్ ని కూడా నియమించుకోవచ్చు.
Business ideas online food services get best profit
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసేవారు కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకి రాలేకపోతున్నవారికి ఈ బిజినెస్ ద్వారా సేవలు అందించవచ్చు. ఇక బ్యాచిలర్స్ అయితే ఈ సేవలు పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. మంచి క్వాలిటీ తో సేవలు అందిస్తే మీ వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. సాయంత్రం స్నాక్స్ కూడా డెలివరీ చేయవచ్చు. ఈ బిజినెస్ బాగా కొనసాగితే రోజుకు 2000 వస్తాయి. అంటే నెలకు 60000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లు కూడా ఈ వ్యాపారాలు చేయవచ్చును. ఈ బిజినెస్ ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లను ఇంప్రెస్స్ చేయగలిగితే మీకు లక్షలు ఖర్చుపెట్టిన దొరకని పబ్లిసిటీ లభిస్తుంది.
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.