Business Ideas : తక్కువ నీటితో ఎకరానికి మూడు కోట్లు ఆదాయం ఇచ్చే సాగు మీకోసం..!
ప్రధానాంశాలు:
Business Ideas : తక్కువ నీటితో ఎకరానికి మూడు కోట్లు ఆదాయం ఇచ్చే సాగు మీకోసం..!
Business Ideas : రైతులు సాధారణంగా సీజనల్ పంటల సాగులో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమయంలో తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే పంట కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇందులో ముందంజలో ఉన్న పంట శ్రీగంధం (చందనం). ఇది అరుదైన, విలువైన చెట్టు. తక్కువ నీటితో, తక్కువ ఎరువులతో పెరిగే ఈ మొక్కలు ఎకరానికి మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం తీసుకురావడం విశేషం. మొక్కలు నాటిన మూడేళ్ల తర్వాత నీటి అవసరం మరింత తగ్గుతుంది. దాదాపు 12 నుంచి 15 ఏళ్లలో ఈ చెట్లు కోతకు సిద్ధమవుతాయి.

Business Ideas : తక్కువ నీటితో ఎకరానికి మూడు కోట్లు ఆదాయం ఇచ్చే సాగు మీకోసం..!
Business Ideas : తక్కువ నీటితో కోట్లా ఆదాయం రావాలంటే ఈ సాగు చేయాల్సిందే
శ్రీగంధం చెట్లు ఇతర చెట్ల వేర్ల నుండి పోషకాలు తీసుకునే స్వభావం కలిగి ఉండటంతో, వీటి మధ్యలో ఇతర ఉపపంటలను సాగుచేయొచ్చు. ఇది ప్రధానంగా శ్రీగంధం వృద్ధికి తోడ్పడటంతో పాటు, రైతులకు అదనపు ఆదాయం కూడా కలిగిస్తుంది. అయితే, ఈ చెట్లు విలువైనవిగా ఉండటంతో దొంగల భయం ఎక్కువ. ముఖ్యంగా ఆరేళ్ల తర్వాత చెట్లను రక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చడం అవసరం. చెట్లు పూర్తిగా ఎదిగిన తర్వాత ఒక్కో చెట్టు నుండి సుమారు 15 నుంచి 20 కేజీల గంధపు చెక్క లభిస్తుంది.
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఒక్క కేజీకి రూ.5,000 నుంచి రూ.12,000 వరకు ఉండటంతో, ఒక్కో చెట్టు కనీసం లక్ష రూపాయల వరకు ఆదాయం ఇస్తుంది. ఒక ఎకరా భూమిలో దాదాపు 300 చెట్లు నాటితే, సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఫామ్‌హౌస్‌లు ఏర్పాటు చేసే వారికి, మెట్ట ప్రాంతాల్లోని రైతులకు ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి అవకాశంగా మారింది. సాధారణంగా సాగు చేసే పంటల కంటే శ్రీగంధం సాగు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం కలిగించే పంటగా నిలుస్తోంది. దీని వల్ల గ్రామీణ యువత కూడా వ్యవసాయం వైపు తిరిగి, దీర్ఘకాలిక ఆదాయం లక్ష్యంగా సాగు పథకాలు రూపొందించుకోవచ్చు.