Home » Business » Chance To Get Rs 35 Lakhs At The Post Office
Business

Post Office : పోస్ట్ ఆఫీస్ లో రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు పొందే ఛాన్స్ .. ఎలాగంటే !

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: April 30, 2025 7:34 pm
Advertisement

Post Office  : పెద్దగా రిస్క్ లేకుండా భద్రతతో కూడిన పెట్టుబడి చేయాలనుకునేవారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు మంచి ఆప్షన్. ఈ క్రమంలో “గ్రామ సురక్ష యోజన” అనే ప్రత్యేక పథకం పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం లో భాగంగా 1995లో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ పథకంలో 19 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తులు జాయిన్ అయ్యే అర్హత కలిగి ఉంటారు. ఈ పథకం గరిష్టంగా 60 ఏళ్ల టెన్యూర్ వరకు అందుబాటులో ఉంటుంది. మహిళలకైతే ఇది ఒక రకంగా భద్రతతో కూడిన గొప్ప పెట్టుబడి అవకాశంగా చెప్పవచ్చు.

Advertisement

Post Office : పోస్ట్ ఆఫీస్ లో రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు పొందే ఛాన్స్ .. ఎలాగంటే !

post office : పోస్ట్ ఆఫీస్ లో ఇలాంటి గొప్ప పథకం ఉందని మీకు తెలుసా..?

ఈ స్కీం ద్వారా కనీసంగా రూ.1,000 నుండి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. వడ్డీ రేటు 7.5% గా ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్‌ 55, 58 లేదా 60 ఏళ్లుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. మీరు నెలవారీగా లేదా త్రైమాసికం, అర్ధ వార్షికం రూపంలో ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రోజుకు రూ.50 చొప్పున మీరు పొదుపు చేస్తే, నెలకు సుమారు రూ.1,515 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. ఇలా 36 సంవత్సరాలు పాటు ప్రీమియం చెల్లిస్తే, 55 ఏళ్ల వయస్సులో మీరు దాదాపు రూ.31.60 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు.

Advertisement

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే చాలా తక్కువ మొత్తం పెట్టుబడి చేస్తే భారీ లాభం పొందవచ్చు. ముఖ్యంగా యువతలో 19 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే ఎక్కువ రాబడి సాధ్యమవుతుంది. ఇది ఒక రకంగా పొదుపు అలవాటు పెంపొందించడమే కాకుండా భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పించే గొప్ప మార్గంగా నిలుస్తుంది. కనుక పొదుపు గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ గ్రామ సురక్ష యోజన పథకాన్ని పరిశీలించవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి