Bank Deposit : ప్రస్తుత కాలంలో చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ శాతం ప్రాధాన్యత చూపిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన కష్టార్జితం లో కొంచెం పెట్టుబడి పెట్టినట్లయితే భవిష్యత్తులో అది మనకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రస్తుతం చాలామంది బ్యాంకు , పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బ్యాంకులో కూడా కొన్ని ప్రత్యేకమైన వడ్డీ రేట్లు అందిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు FD ఉంచడానికి కొన్ని బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లను కూడా అందించడంచడం జరుగుతుంది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుత కాలంలో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ FD చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్యాంకులలో FD ఉంచడం ద్వారా వారికి అవసరమైనప్పుడు ఆ డబ్బును తీసుకుంటారు. అయితే చాలామంది వడ్డీ ఎక్కడ ఎక్కువగా వస్తుందో తెలుసుకొని ఆ తర్వాత FD ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారికి ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యాంకు భారతదేశం మొత్తంలోనే అత్యధిక వడ్డీ రేటును అందించే బ్యాంక్ గా పిలవబడుతుంది. అందుకే చాలామంది వినియోగదారులకు ఇది ఎంతో ఇష్టమైన బ్యాంకుగా పేరుపొందింది.
అదే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది దేశంలోనే అత్యధిక FD వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంక్. ఈ బ్యాంకులో మీరు FD ని పెడితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ బ్యాంకులో FD ఫై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ బ్యాంకు సాధారణ పౌరులకు 9.25% వడ్డీ , సీనియర్ సిటిజన్లకు ఎఫ్డిఫై 9.75 వడ్డీని అందించడం జరుగుతుంది.
అయితే దేశంలో నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సీనియర్ సిటిజనులకు అత్యధిక వడ్డీ రేటును అందించడం ద్వారా బాగా పాపులర్ అయింది.అయితే మీరు ఈ బ్యాంకులో ఒక లక్ష డిపాజిట్ చేసినట్లయితే 91 నుండి 1080 రోజులకు 6.50% వడ్డీ లభిస్తుంది. అలాగే 181 రోజుల నుండి 545 రోజులకు 9 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు దాదాపు కోటి నుండి 5 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు కలిగి ఉన్న బ్యాంకుగా పేరుపొందింది. అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7 నుండి 14 రోజులకు 3.5% వడ్డీ ,15 నుండి 29 రోజులకు 5% వడ్డీ అందిస్తుంది. మరి మీరు FD ద్వారా అధిక మొత్తంలో వడ్డీని పొందాలంటే ఈ బ్యాంకు సరైనదని చెప్పవచ్చు
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.