
Rohit Sharma : నాకౌట్‌లోను కోహ్లీ ఫెయిల్.. అతడు అలా ఆడడానికి ఓ కారణం ఉందన్న రోహిత్ శర్మ
Rohit Sharma : టీ20 ప్రపంచకప్ లో టీమిండియా అప్రతిహతంగా దూసుకుపోతుంది. బ్రేకుల్లేని బండిలా.. ప్రత్యర్థి ఎవరైనా సరే తొక్కేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా చెందకుండా ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్ సైడ్ మ్యాచులో భారత్ ఏకంగా 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), హార్దిక్ పాండ్యా(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23) దుమ్మురేపగా.. ఆ తర్వాత భారత్ బౌలర్లు అక్షర్ పటేల్(3/23), కుల్దీప్ యాదవ్(3/19), బుమ్రా (2/12) రఫ్ఫాడించడంతో భారత్ భారీ విజయం సాధించింది.
అభిమానుల నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ల వరకు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం మళ్లీ విఫలమయ్యారు. ఈ టోర్నీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. ధనాధన్ బ్యాటింగ్ చేస్తారనుకుంటే.. బొక్కబొర్లాపడుతున్నారు. ఆ ఇద్దరు శివమ్ దూబే, విరాట్ కోహ్లి. టీమిండియాకి మూల స్తంభమైన కింగ్ ఈ మెగాటోర్నీలో వరుసగా విఫలమయ్యాడు. ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లి సింగిల్ డిజిట్‌కు పరిమితమవ్వడం ఇది ఏకంగా అయిదోసారి. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు సార్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. 2012 నుంచి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లీ ఇలా మునుపెన్నడూ విఫలమవ్వలేదు. 2012 నుంచి 2022 వరకు అతను రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాడు.
Rohit Sharma : నాకౌట్‌లోను కోహ్లీ ఫెయిల్.. అతడు అలా ఆడడానికి ఓ కారణం ఉందన్న రోహిత్ శర్మ
కోహ్లీ ఇలా విఫలం కావడం గురించి స్పందించిన రోహిత్ శర్మ.. కోహ్లి నాణ్యమైన ప్లేయర్ అని, ప్రతి ఆటగాడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని మద్దతు ఇచ్చాడు. తీవ్రతతో కనిపిస్తున్నాడని, ఫైనల్ కోసం కోహ్లి గొప్ప ప్రదర్శన దాచి పెట్టి ఉండొచ్చని రోహిత్ అన్నాడు. ”విరాట్ కోహ్లి క్వాలిటీ ప్లేయర్. ప్రతీ ఆటగాడు ఈ దశను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని క్లాస్ ఏంటో, ప్రధాన మ్యాచ్‌ల్లో అతడు ఎంత కీలమమా మాకు తెలుసు. ఫామ్ అనేది సమస్య కాదు. 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతుంటే ఫామ్ అనేది అసలు సమస్యగా ఉండదు. తుదిపోరులో కోహ్లి తప్పక ఉంటాడు. జట్టుగా మేం ప్రశాంతతో ఉండాలి. అప్పుడు ముగింపు మ్యాచ్‌లో కూడా మేము అద్భుతంగా రాణించగలుగుతాం అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.