Home » Business » Gold Price May14th 2025
Business

Today Gold Rate : తగ్గిన బంగారం ధర .. ధరలెలా ఉన్నాయంటే?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 14, 2025 1:57 pm
Advertisement

Today Gold Rate : బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి 10 గ్రాములకు రూ.96,060కు పరిమితమైంది. ఈ ధర గత కొద్ది వారాలుగా పెరుగుతూ వచ్చిన ధరలతో పోలిస్తే వినియోగదారులకు కొంత ఊరట కలిగించే విషయం. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ తగ్గుదలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములకు రూ.500 తగ్గి ప్రస్తుతం రూ.88,050 వద్ద కొనసాగుతోంది. సాధారణ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర తగ్గడంతో బంగారంపై మళ్లీ కొనుగోలు ఆసక్తి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు కొంత స్థిరంగా ఉండటంతో దేశీయంగా కూడా ధరలు ప్రభావితమవుతున్నాయి.

Today Gold Rate : తగ్గిన బంగారం ధర .. ధరలెలా ఉన్నాయంటే?

Advertisement

మరోవైపు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర రూ.1,09,000 వద్ద యథాతథంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరలే అమలులో ఉన్నాయి. హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.97,000గా ఉంది. కిలో వెండి ధర రూ.99,100గా ఉండగా..విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.97,000గా ఉంది. కిలో వెండి ధర రూ.99,100గా ఉంది. ఇక విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.97,000గా ఉంది. కిలో వెండి ధర రూ.99,100, ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.97,000గా ఉంది. కిలో వెండి ధర రూ.99,100గా ఉంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి