Good News : కేంద్రం నెలకు యువతకు రూ. 5 వేలు.. దీనికోసం ఈరోజే అప్లయ్ చెయ్యండి
ప్రధానాంశాలు:
good News : కేంద్రం నెలకు యువతకు రూ. 5 వేలు.. దీనికోసం ఈరోజే అప్లయ్ చెయ్యండి
Good News : యువత నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యోగ అవకాశాల దిశగా మార్గదర్శకంగా మారనున్న ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు గడువు ఈరోజుతో ముగిస్తోంది. ఈ పథకం 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన, పూర్తికాలిక ఉద్యోగాలలో లేకపోయిన, రెగ్యులర్ కాలేజీకి హాజరుకాని యువతకు అర్హత కలదు. కానీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ లేదా దూరవిద్య కోర్సులు చేసే వారు మాత్రం అర్హులే.

Good News : కేంద్రం నెలకు యువతకు రూ. 5 వేలు.. దీనికోసం ఈరోజే అప్లయ్ చెయ్యండి
Good News నెలకు కేంద్రం నుండి రూ. 5 వేలు దక్కించుకోవాలంటే ఈరోజు ఇలా చెయ్యండి
ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులు దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని పొందుతారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి నెలా రూ. 5,000 స్టైపెండ్ ఇవ్వబడుతుంది. ఇందులో యజమాని రూ. 500 చెల్లిస్తే, మిగిలిన రూ. 4,500ను కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇంటర్న్ ఆధార్-లింక్డ్ ఖాతాలోకి జమ చేస్తుంది. అంతేకాకుండా, ప్రారంభంలో ఒకేసారి రూ. 6,000 ప్రోత్సాహక నిధిని కూడా అందించనున్నారు. ఈ పథకం ద్వారా యువతకు విద్యతోపాటు వ్యాపార పరిజ్ఞానం పెరిగే అవకాశం దక్కుతుంది. అలాగే, వారి భవిష్యత్ కెరీర్‌కు ఇది బలమైన బేస్ వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవడానికి, అర్హులైన అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ www.pminternship.mc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కావున ఇంకా అప్లయ్ చేయని వారు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దేశ యువతకు సామర్థ్యాన్ని వెలికితీసే ఈ పథకం, వారికి అనుభవం, డిసిప్లిన్, మరియు మార్కెట్ అవగాహనను అందిస్తూ భవిష్యత్ విజయాలకు వేదిక కాబోతుంది.