Business Idea : కేరళకు చెందిన ఓ మహిళా రైతు తనకు చెందిన మారుతీ గార్డెన్స్ లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు మరియు చేపలను సాగు చేస్తోంది. అయితే ఆమె ఎలాంటి రసాయన ఎరువుల వాడకుండా సేంద్రీయ పద్ధతిలోని వీటిని పండిచడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంటోంది. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ ఎల్పుల్లి గ్రామంలోనే ఈ మారుతీ గార్డెన్స్ ఉంది. దాదాపు 24 ఎకరాల భూమిలో బంగారం లాంటి వరి పొలాలు, పండ్ల తోటలు, కూరగాయలు, చేపలను పి. భువనేశ్వరి సాగు చేస్తున్నారు. ఈ మారుతీ గార్డెన్.. ఈడెన్ గార్డెన్ కంటే ఏమాత్రం తక్కువ కాదని అక్కడి ప్రజలు చెప్తుంటారు. అయితే 90వ దశకంలో… 4 ఎకరాల బంజరు భూమిలో సేంద్రియ పంటలు పండిచడం ప్రారంభించింది భవనేశ్వరి. రాళ్లు, రప్పలు ఉన్న భూమిని సస్య శ్యామలం చేసి, చివరికి 24 ఎకరాలకు విస్తరించింది.“ప్రారంభంలో… ఎండిన భూమి, రాళ్లు, రప్పలతో నిండి ఉంది. అయితే ఆ భూమిని చదును చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగోలా కష్టపడి అందులో పంటలు పండించడం మొదలు పెట్టాను.
అయితే వ్యవసాయానికి నేను ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు వాడలేదు. సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండించాను.”- పి. భూవనేశ్వరిసంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన భువనేశ్వరి.. పదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. తనకు చదువుకంటే కూడా వ్యవసాయం చేయడం పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. తన నాన్న కుంజికన్నన్ మన్నాడియర్ కు సాయంగా ఆమె కూడా పొలం పనులు చేసేది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లపోయింది. 1995లో భువనేశ్వరి భర్త వెంకట చలపతి స్కూల్ టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఖాళీగా ఉండటం ఇష్టం లేక వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వారికి ఉన్న నాలుగెకరాల బంజరు భూమిలో పంటలు పండించడం చాలా కష్టం. కానీ ఈ భూమిని ఎలాగైనా చదును చేయాలని నిశ్చయించుకుంది భువనేశ్వరి. ముందుగా కలుపు మొక్కలు, పొదలను తొలగించి ఆపై నిపుణుల సాయంతో షీమా కొన్నా(గ్లిరిసిడియా) మొక్కలను నాటింది.
వీటిని ఆ భూమిలో నాటడం వల్ల భూమి పంటలు పండించేందుకు అణువుగా మారుతుంది. ఇలా దాదాపు ఐదేళ్లు కష్టపడి భూమిని చదును చేసింది.ఈ సమయంలోనే ఎరువులు, రసాయన పదార్థాలు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండిచాలనకున్న ఆమె దాని గురించి తెలుసుకునేందుకు ఎంతో కష్టపడింది. సహజ సేంద్రియ వ్యవసాయానికి మార్గదర్శకుడైన సుభాష్ పాలేకర్ వర్క్‌షాప్‌కు కూడా హాజరైంది. అక్కడే రసాయన ఎరువులకు బదులుగా జీవామృతం, పంచగవ్యం వంటి సహజసిద్ధమైన ఎరువులను తయారు చేయడం నేర్చుకుంది. ఈ క్రమంలోనే బ్యాంకులో రుణం తీసుకొని 20 ఆవులను కొనుగోలు చేసింది. వాటి నుంచి వచ్చే పాలను అమ్ముకుంటా డబ్బులు సంపాదించింది. అలాగే పేడ, మూత్రంతో ఎరువులు తయారు చేస్తూ.. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించింది. ఇలా చేపల సాగును కూడా ప్రారంభించి లాభాలను సాధించింది.
సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్న భవనేశ్వరికి ఇటీవలే మలయాళ మనోరమ వారు కర్షక శ్రీ అవార్డునిచ్చారు. 62 ఏళ్ల వయసున్న భువనేశ్వరి ఇప్పటికీ తెల్లవారక ముందే నిద్రలేచి పొలం పనులు చేస్తుంది. స్వయంగా ఆమే ట్రాక్టర్ నడుపుతూ తన పొలం దున్నుతుంది. వ్యవసాయ పనులు చేయడం వల్లే ఆరు పదుల వయసులో కూడా తాను ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నాని చెబుతుంటుంది. వ్యవసాయం చేయడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆమె అంటుంది. భువనేశ్వరి వ్యవసాయం చేయడంతో పాటు, టిల్లర్లు మరియు ట్రాక్టర్లను నడపడంలో కూడా నిపుణురాలు.“పాలక్కాడ్‌లో టిల్లర్‌ను సొంతం చేసుకున్న వారిలో మొదటి వ్యక్తి అయిన మా నాన్న వద్ద నేను టిల్లర్ నడపడం నేర్చుకున్నాను. కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్ నడపడం కూడా నేర్చుకున్నాను. నా పొలాన్ని ఎక్కువగా నేనే దున్నుతుంటాను.”- పి. భూవనేశ్వరి
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.