Radhey Shyam : ఒకప్పుడు ప్రేమ కథలకు అంతగా బడ్జెట్ ఖర్చు చేసేవాళ్లు కాదు. లవ్‌స్టోరీస్కి భారీ సెట్లు వేయాల్సిన పని ఉండదు. హీరో ఎలివేషన్ పెద్దగా ఉండదు. యాక్షన్ సీన్లు అంతాగా ఉండవు. సింపుల్‌గా తక్కువ బడ్జెట్‌లో కంప్లీట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలాకాదు. లవ్‌స్టోరీస్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. పూర్తి స్థాయి ప్రేమకథకు కోట్లు ఖర్చు చేయడం.. అది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటించడంతో రాధేశ్యామ్‌కు మంచి హైప్ వచ్చింది. మూవీ ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇట్రెస్టింగ్ డైలాగ్స్ తో సినిమాపై మంచి మంచి హైప్ క్రీయేట్ అయింది. ఇప్పటికే భారీ స్థాయిలో మార్కెట్ జరిగిందని అంచనా..
కాగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది.అయితే రాధాకృష్ణకు ఇది రెండో సినిమా. బాహుబలి, సాహో లాంటి చిత్రాల తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేయడం అందులో పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం అవడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మంచి క్రేజ్ వచ్చింది. పూర్తి స్థాయి ప్రేమకథ చిత్రం పై ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ మూవీ కంప్లీట్ చేశారు. అయితే ఎక్కువగా ప్రొడ్యూసర్స్ భారీ యాక్షన్ సినిమాలపై, రివేంజ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపై ఖర్చు చేస్తుంటారు. కానీ రాధేశ్యామ్ లాంటి పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంపై భారీ స్థాయిలో ఖర్చు చేయడం సాదారణ విషయం కాదు.
అయితే యాక్షన్ సినిమాల్లో గ్రాఫిక్స్, టెక్సీషియన్స్ కి ఎక్కువగా ఖర్చు అవుతుంది. మరీ ప్రేమ కథా చిత్రాల్లో అంతగా ఎం ఖర్చు ఉంటుందని అనుకోవచ్చు కానీ రాధేశ్యామ్ విషయానికి వస్తే దాదాపు వందకు పైగా సెట్స్ వేయడం, యూరప్‌లోని ఇటలీలో షూటింగ్ జరగడంతో బడ్జెట్ భారీగానే పెరుగుతుంది. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ మంచి హైప్ తీసుకొచ్చాయి. ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డేల స్టైల్, బ్యూటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయితే మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న రాధేశ్యామ్ కలెక్షన్ల సూనామీ కోసం ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.