Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ పనితీరును, వాటిలో ఉండే రిస్కును తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ సంస్థను ఫాలో అవ్వండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ పనితీరును, వాటిలో ఉండే రిస్కును తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ సంస్థను ఫాలో అవ్వండి…!

Mutual Funds : రిటైల్ మదుపరులను గత కొన్నేళ్లుగా ఆకర్షిస్తున్న మదుపు మార్గం మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ సహి హై నినాదంతో మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహన కల్పిస్తుంది AMFI ( అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) . లాభాపేక్ష లేని సంస్థగా 1995లో ఏర్పాటు అయిన ఈ సంస్థ మదుపరుల ప్రయోజనాలే ధ్యేయంగా నడుస్తుంది. అంతేకాక అటు సెబి, ఇటు భారత ప్రభుత్వం వద్ద మ్యూచువల్ ఫండ్ మదుపరుల వాణి వినిపించడానికి […]

 Authored By tech | The Telugu News | Updated on :13 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ పనితీరును, వాటిలో ఉండే రిస్కును తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ సంస్థను ఫాలో అవ్వండి...!

Mutual Funds : రిటైల్ మదుపరులను గత కొన్నేళ్లుగా ఆకర్షిస్తున్న మదుపు మార్గం మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ సహి హై నినాదంతో మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహన కల్పిస్తుంది AMFI ( అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) . లాభాపేక్ష లేని సంస్థగా 1995లో ఏర్పాటు అయిన ఈ సంస్థ మదుపరుల ప్రయోజనాలే ధ్యేయంగా నడుస్తుంది. అంతేకాక అటు సెబి, ఇటు భారత ప్రభుత్వం వద్ద మ్యూచువల్ ఫండ్ మదుపరుల వాణి వినిపించడానికి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. నైతిక విలువలతో పారదర్శకంగా పనిచేయడం తమ ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థ చెప్పుకుంటుంది. ఈ సంస్థలో వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన అధికారులు సలహాదారులుగా, మార్గనిర్దేశకులుగా ఉన్నారు. వీరి వెబ్ సైట్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి అధ్యయనం చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. యాక్సిస్ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు లాంటి ప్రముఖ బ్యాంకులతోపాటు ఆదిత్య బిర్లా, సుందరం మ్యూచువల్ ఫండ్స్ లాంటి సంస్థలు కూడా ఈ అసోసియేషన్ లో భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో ఈ సంస్థ అందించే సమాచారాన్ని చాలామంది ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు.

Mutual Funds : మదుపరులకు ఉపయోగాలు

ఈ అసోసియేషన్ వెబ్ సైట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి. వివిధ రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఏ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్కు ఎంత ఉంటుంది ఇలాంటి విషయాలను చర్చించారు. అలాగే ఎన్ఐవి , ఎక్స్పెన్స్ రేషియో లాంటి సూచికలకు అర్థమేమిటి వాటిని ఏ సందర్భంలో ఎలా అన్వయించుకోవాలో కూడా చెప్పారు. అంతేకాక మ్యూచువల్ ఫండ్స్ పై ఉండే అపోహల గురించి కూడా వారు ప్రస్తావించారు. వివిధ రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మదుపు చేయాలి? చేసిన మదుపును ఎలా వెనక్కు తీసుకోవాలి లాంటి విషయాలను వివరంగా చెప్పారు. ఇవి మదుపరులకు తమ లావాదేవీలు ఈజీగా చేసుకునేలా తోడ్పడతాయి. పారదర్శకతకు పెద్దపీట వేయడం అసోసియేషన్ ప్రధాన లక్ష్యం. వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీం వివరాలు ప్రతినెల అందుబాటులో ఉంచుతారు. ఫండ్ పోర్ట్ పోలియో మార్పులు చేర్పులు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రతి ఫండ్ పనితీరును తెలియజెప్పడానికి అవసరమైన డేటా ఈ అసోసియేషన్ వారి వెబ్సైట్లో పొందుపరిచారు.

Mutual Funds : ఏఎంఎఫ్ఐ డేటాతో మదుపు నిర్ణయాలు

డేటా పరంగా అసోసియేషన్ అందిస్తున్న వివరాలు ఒక పెద్ద భాండాగారం అంటే అతిశయక్తి కాదు. ఈ అసోసియేషన్ వెబ్ సైట్లో ప్రతినెల త్రైమాసికానికి సంబంధించి వివిధ మ్యూచువల్ ఫండ్స్ తరగతులలో జరుగుతున్న మార్పుల వివరాలను అందిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అనే మదుపు మార్గం పనితీరు ఆ నెలలో లేదా త్రైమాసికంలో ఎలా ఉందనే విషయం ఈ సంస్థ తెలియజేస్తుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్స్ స్కీం ద్వారా మార్కెట్లో మదుపు చేసిన మొత్తం విలువ ఎంత అనేది ఫండ్ పనితీరు అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైన సూచిక. ఆ వివరాలను కూడా ఈ అసోసియేషన్ వెబ్సైట్ నుంచి పొందగలం. మ్యూచువల్ ఫండ్స్ పనితీరుకు సంబంధించిన విలువైన సమాచారం అసోసియేషన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. ఒక మదుపరి రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ పనితీరును పోల్చి చూడాలంటే ఇలాంటి సమాచారం చాలా కీలకం.

Mutual Funds మ్యూచువల్ ఫండ్స్ పనితీరును వాటిలో ఉండే రిస్కును తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ సంస్థను ఫాలో అవ్వండి

Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ పనితీరును, వాటిలో ఉండే రిస్కును తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ సంస్థను ఫాలో అవ్వండి…!

Mutual Funds : రాబడిని ఎలా పోల్చుకోవాలి

ఇతర మదుపు మార్గాల్లో వచ్చే వార్షిక వడ్డీ మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే రాబడితో పోల్చుకుంటే ఎలా ఉంది. ఈ విషయం తెలియాలంటే ఏఎమ్ఎఫ్ఐ వారి వెబ్సైట్లో ఇచ్చిన బెంచ్ మార్క్ పని తీరు వేరే మదుపు మార్గం ద్వారా వచ్చే వడ్డీతో పోల్చి చూడాలి. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా రిస్క్ మీద అవగాహన రావాలంటే రెస్కో మీటర్ పేరు మీద ఇచ్చిన వివిధ వర్గాలలో ఉండే బెంచ్ మార్క్ పనితీరు ఎంత ఉందో చూడాలి. ఉదాహరణకు ఎక్కువ రిస్కు ఉండే స్కీములకు మధ్యస్థంగా రిస్క్ ఉండే స్కీములకు మధ్య పనితీరులో ఎంత తేడా ఉందో చూడాలి. ఈ తేడా ఎక్కువగా ఉంటే అప్పుడు ఎక్కువ రిస్కూల్లో స్కీముల ద్వారా మదుపు చేయడం చెప్పదగిన సూచన. ఒకవేళ ఈ రెండు వర్గాల స్కీములకు సంబంధించి బెంచ్ మార్క్ పనితీరు ఒకే విధంగా ఉంటే అప్పుడు ఎక్కువ రిస్క్ ఉన్న స్కీమ్ ఎన్నుకోవడం వల్ల ఉపయోగం లేదు. రెండు స్కీముల మీద వివిధ కాల పరిమితులలో వచ్చిన రాబడిని పరిశీలించాలి. ఒకే రిస్క్ వర్గంలో ఉన్న రెండు స్కీం లలో ఏది మంచిదనేది తెలుస్తుంది. ఆర్థిక లక్ష్యాలకు తగిన విధమైన పోర్ట్ ఫోలియో నిర్మించుకోవడానికి స్కీం ద్వారా వచ్చిన రాబడి విలువ, దీర్ఘకాల పనితీరు, స్కీమ్ మదుపు చేస్తున్న రంగాలపై అవగాహన ఉండాలి. ఈ వివరాలను వెబ్సైట్లో వివరంగా తెలిపారు.

సహజంగా రిస్క్ తగ్గించుకునే క్రమంలో మదుపరులు వివిధ మార్గాల ద్వారా మదుపు చేస్తారు. చాలామంది రెండు మార్గాలను ఎలా పోల్చాలి అనే విషయంలో ఇబ్బంది పడతారు. కాలక్రమంలో ఒక బలమైన పోర్టు పోలియో నిర్మించుకోవాలని అభిలాష ఉన్న మదుపరులు ఎప్పటికప్పుడు పనితీరు బాగాలేని వదిలేసి తమకు తగినంత రాబడి ఇచ్చిన మదుపరుల మార్గాలను మాత్రమే ఉంచుకోవాలి. మదుపు చేయడం ఎంత ముఖ్యమో దాని సమయానుకూలంగా పర్యవేక్షించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులు ఒకప్పుడు పనితీరు బాగుంది అనుకున్న మదుపు నేడు ఏవో అవాంతారాల వలన నిరాశ జనక ఫలితాలు ఇస్తుండవచ్చు కానీ అన్ని మదుపు మార్గాలలో పనితీరు ఒకేలా ఉండదు. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ పనితీరు ఒక మిడ్ క్యాప్ ఫండ్ పనితీరు వేరుగా ఉంటాయి. ఈ రెండింటిలో ఏది అనుకూలంగా ఉందో తెలుసుకోవడం పోర్టుఫోలియో నిర్మాణంలో చాలా ముఖ్యం. అలాగే SIP ఒకేసారి మదుపు చేయడం మధ్య ఏది మంచిదో తెలుసుకోవడం అనే ప్రశ్న కూడా తరచుగా వస్తుంటుంది. మదుపు మార్గంలో కొన్ని బలాలు పరిమితులు ఉంటాయి. ఎప్పటికప్పుడు పోర్టుఫోలియో ఎలా ఉందో చూసుకొని ఒకవేళ ఏదైనా ఫండ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే మరో మదుపు ఫండ్ మార్గంలోకి మళ్ళించుకోవాలి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది