Personal Loan : చాలా చీప్‌గా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు.. అది ఎలా అంటారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Personal Loan : చాలా చీప్‌గా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు.. అది ఎలా అంటారా?

Personal Loan : మ‌న ప‌నుల‌తో మ‌నం బిజీబిజీగా ఉంటుండ‌గా, మ‌ధ్య‌లో ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం కాల్స్ వస్తుండ‌డం వాటి వ‌ల‌న మ‌న‌కు చిరాకు రావ‌డం కూడా జ‌రుగుతుంటుంది. కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి చాలా మంది ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటారు. మధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ఎక్కువ‌గా వాటిపై ఆధార‌ప‌డుతుంటారు. అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే అవసరాలు తీరడంతో పాటు వ్యాపారాలలో కూడా ప్రగతి సాధించవచ్చు. మిగిలిన రుణాలతో పోల్చితే వ్యక్తిగత […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Personal Loan : చాలా చీప్‌గా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు.. అది ఎలా అంటారా?

Personal Loan : మ‌న ప‌నుల‌తో మ‌నం బిజీబిజీగా ఉంటుండ‌గా, మ‌ధ్య‌లో ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం కాల్స్ వస్తుండ‌డం వాటి వ‌ల‌న మ‌న‌కు చిరాకు రావ‌డం కూడా జ‌రుగుతుంటుంది. కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి చాలా మంది ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటారు. మధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ఎక్కువ‌గా వాటిపై ఆధార‌ప‌డుతుంటారు. అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే అవసరాలు తీరడంతో పాటు వ్యాపారాలలో కూడా ప్రగతి సాధించవచ్చు. మిగిలిన రుణాలతో పోల్చితే వ్యక్తిగత రుణాలకు ధ్రువీకరణ పత్రాలు పెద్దగా అవసరం ఉండదు. అయితే బ్యాంకులు వీటిని రిస్క్ గా పరిగణిస్తాయి.

త‌నఖా పెట్టుకోవ‌డానికి బ్యాంకుల‌లో ఎలాంటి వ‌స్తువులు ఉండ‌వు కాబ‌ట్టి వ‌డ్డీ రేటుని బ్యాంకులు గ‌ట్టిగానే విధిస్తాయి. అయితే వ్యక్తిగత రుణాలను కూడా తక్కువ వడ్డీ రేటుకు పొందే అవకాశం ఉంది. దానికి కోసం మీరు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా క్రెడిట్ స్కోరు. ప‌ర్స‌న‌ల్ లోన్ ఇచ్చే వారు ముందుగా క్రెడిట్ స్కోరు ప‌రిశీలిస్తారు. దానిని బ‌ట్టే రుణం ఇవ్వాలా వ‌ద్దా అని నిర్ణ‌యిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో మనం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు మంచిగానే ఉంటుంది. ఇక మ‌నం రుణం తీసుకునే ముందు ఇత‌ర రుసుముల గురించి క్లియ‌ర్‌గా ప‌రిశీలించుకోవాలి. వడ్డీ, ఇతర ఖర్చులను ఎంత కలిపారో తెలుసుకోవాలి.

ఇక రుణాలపై వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ప్రాసెసింగ్ చార్జీలు కూడా మారుతూ ఉంటాయి. రుణం తీసుకునే ముందు వాటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ బ్యాంకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయో, ఎక్కడ తక్కువ చార్జీలు విధిస్తారో త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటంఉది. ఇక అప్పు తీసుకున్న తర్వాత వాయిదాలు సకాలంలో చెల్లించగలరో, లేదో లెక్కవేసుకొని దానిని బ‌ట్టి ముందుకు వెళ్లాలి. మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులతో పాటు అత్యవసరాలకు కూడా కొంత మొత్తాన్ని ప‌క్క‌న పెట్టి ముందుకు సాగాలి

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది