Today Gold Price : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఎంత ఉందో తెలిస్తే గుండెల బాదుకుంటారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2025,11:07 am

ప్రధానాంశాలు:

  •  Today Gold Price : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఎంత ఉందో తెలిస్తే గుండెల బాదుకుంటారు..!

Today Gold Price : బంగారం ధరలు తగ్గేదేలే అంటున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం Gold Rate ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి రూ.99,600కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పుత్తడి రూ.400 పెరిగి రూ.91,300 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా రూ.1000 పెరిగి కేజీకి రూ.1,14,000కి చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా తేడా లేదు. ప్రస్తుతం బంగారం తులం ధర రూ.లక్షకు కేవలం వెయ్యి రూపాయల దూరంలో ఉండటం గమనించవచ్చు. ఈ ధరల పెరుగుదల కారణంగా బంగారం కొనుగోలు చేసే వారికి ఇది పెద్ద భారంగా మారుతోంది.

Today Gold Price : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఎంత ఉందో తెలిస్తే గుండెల బాదుకుంటారు..!

Today Gold Price : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఎంత ఉందో తెలిస్తే గుండెల బాదుకుంటారు..!

Today Gold Price వామ్మో పసిడి ధర Today Gold Rate ఇంత పెరిగేతే.. ఎలా కొనుగోలు చేయాలి

స్టాక్ మార్కెట్లలో గల అస్తవ్యస్తతలు, ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో ఇటీవల జరిగిన నష్టాల కారణంగా పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యలు వంటి భద్రతా సంక్షోభాలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. దీంతో పసిడి వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ పెరిగింది.

బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా పెద్దగా ప్రభావం లేకపోయినా, ప్రపంచ మార్కెట్ల డిమాండ్ వల్ల ధరలు ఎగబాకుతున్నాయి. ఇటువంటి సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు నాణ్యత విషయంలో, బరువులలో స్పష్టత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు పెరిగిన ఈ పరిస్థితుల్లో చిన్న బరువు తేడాలు కూడా పెద్ద నష్టాలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కావున బంగారం షాపింగ్ చేసే ముందు సరైన సమాచారం సేకరించి, నమ్మదగిన దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి