Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయంగా కూడా స్వల్ప ప్రభావం పడింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,757గా, 10 గ్రాములు రూ.97,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు రూ.8,944గా, 10 గ్రాములకు రూ.89,440గా పలుకుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.7,318కు చేరుకుంది.

Today Gold Price ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

అలాగే శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.98,190గా ఉండగా, ఆదివారం నాటికి రూ.320 పెరిగి రూ.98,510కు చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర కూడా రూ.402 పెరిగి రూ.98,300కి చేరింది. దీంతో వినియోగదారులు ఈ వృద్ధిని గమనిస్తూ కొనుగోళ్లపై మెల్లగా స్పందిస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో గోల్డ్ కొనుగోళ్లను ముందుగానే చేసుకునే వారు ఇప్పట్లో ఈ ధరలను చూసి ఊహించుకోవచ్చు.

హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు వంటి నగరాల్లో కూడా బంగారం ధరలు సమానంగా ఉన్నాయి. ఈనెల 20న పది గ్రాముల పసిడి ధర ఈ నాలుగు నగరాల్లో అన్ని చోట్లా రూ.98,510గా, కిలో వెండి ధర రూ.98,300గా నమోదైంది. బంగారం, వెండి ధరలు పెరగడాన్ని చూస్తే త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది