Today Gold Price : హమ్మయ్య.. లక్ష నుండి దిగొస్తున్న బంగారం ధర.. ఈరోజు ఎంత ఉందంటే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Price : హమ్మయ్య.. లక్ష నుండి దిగొస్తున్న బంగారం ధర.. ఈరోజు ఎంత ఉందంటే !

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2025,7:56 am

ప్రధానాంశాలు:

  •  Today Gold Price : హమ్మయ్య.. లక్ష నుండి దిగొస్తున్న బంగారం ధర.. ఈరోజు ఎంత ఉందంటే !

Today Gold Price : గత మూడు రోజుల క్రితం లక్ష రూపాయల మార్క్‌ను చేరిన బంగారం ధర Gold Rate చివరికి తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ తగ్గుదల నేడు మరింత స్పష్టంగా కనిపించింది. దీంతో బంగారం Gold Rate కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. బంగారం ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలకు ఇది ఊహించని ఉపశమనం కలిగించింది.

Today Gold Price హమ్మయ్య లక్ష నుండి దిగొస్తున్న బంగారం ధర ఈరోజు ఎంత ఉందంటే

Today Gold Price : హమ్మయ్య.. లక్ష నుండి దిగొస్తున్న బంగారం ధర.. ఈరోజు ఎంత ఉందంటే !

Today Gold Price బంగారం ధరల్లో తగ్గుదల ..పసిడి ప్రియులకు ఊరట

ఈ రోజు ఏప్రిల్ 25 న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,823గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,004కి చేరుకుంది. అదే సమయంలో 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,367గా ఉంది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,320గా ఉండగా, గురువారం నాటికి రూ.130 తగ్గి రూ.99,190కి పడిపోయింది. అయితే వెండి ధరలో మాత్రం వ్యత్యాసం కనిపించింది. కిలో వెండి బుధవారం రూ.98,650గా ఉండగా, గురువారం నాటికి రూ.1,800 పెరిగి రూ.1,00,450కి చేరుకుంది.

బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దిగుమతి సుంకాలు, కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, కరెన్సీ మారకం విలువలు వంటి అంశాలు ప్రధాన ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు, ఇతర దేశాల్లో జారీ అయ్యే ఆర్థిక విధానాలు కూడా భారతదేశ బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. ప్రజల కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గడం వల్ల పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశంగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది