Gold and Silver Rates 1st March 2026 : ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు భారీ షాక్

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 March 2026,9:00 am

Gold and Silver Rates 1st March 2026 : పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేస్తున్న దాడులు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉండటంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు పరుగులు తీశారు.

Gold and Silver Rates 1st March 2026 : ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు భారీ షాక్

Gold and Silver Rates 1st March 2026 : ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు భారీ షాక్

దీని ఫలితంగా డిమాండ్ అమాంతం పెరిగి, ఒక్కరోజే బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. తులం బంగారంపై ఏకంగా రూ.7 వేలకు పైగా, కిలో వెండిపై ఏకంగా రూ.25 వేల వరకు పెరగడం బులియన్ మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.

Gold and Silver Rates 1st March 2026 ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

నిన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన పసిడి, ఈరోజు కళ్లు చెదిరే రేట్లతో దర్శనమిస్తోంది. ముఖ్య నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ Hyderabadలో 10 గ్రాముల 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారం ధర రూ.1,68,710 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్లపై ఏకంగా రూ.7,140, 22 క్యారెట్లపై రూ.6,550 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,68,710 గానూ, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,54,650 గానూ ట్రేడ్ అవుతోంది. న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.1,68,860 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ.1,54,800 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,69,640 గానూ, 22 క్యారెట్ల రేటు రూ.1,55,500 గానూ ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,68,710 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,54,650 వద్ద ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఇది రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది.

Gold and Silver Rates 1st March 2026 ఒక్కరోజే రూ.25,000 పెరిగిన వెండి ధరలు

బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే కిలో వెండిపై రూ.25 వేల పెంపు నమోదు కావడం మార్కెట్ చరిత్రలోనే అరుదైన విషయం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు ఏకంగా రూ.3.20 లక్షల (Rs.3,20,000) వద్ద ట్రేడ్ అవుతోంది. తులం వెండి సుమారు రూ.3,200 పలుకుతోంది. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో సిల్వర్ ధర రూ.2.95 లక్షల Rs.2,95,000 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో కల్లోలం

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక్కరోజే 100 డాలర్ల పైన పెరిగి, ప్రస్తుతం 5,278 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి రేటు ఒక్కరోజే 7.59 శాతం జంప్ చేసి ఔన్సుకు 93.72 డాలర్ల పైకి చేరుకుంది.

కొనుగోలుదారులకు సూచన

యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, స్థానిక పన్నులు, తరుగు, మజూరీల ఆధారంగా జ్యువెలరీ షాపుల్లో ఈ ధరల్లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ స్థానిక మార్కెట్లో ధరలను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి