Home » Business » Today Gold Price 26 04 2025
Business

Today Gold Price : దిగొస్తున్న పసిడి ధరలు.. కొనేవారు ఇదే మంచి అవ‌కాశం.. రోజు ఏప్రిల్ 26 గోల్డ్ ధరలు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: April 26, 2025 8:59 am
Advertisement

Today Gold Price : పది రోజుల క్రితం వరకు బంగారం ధరలు ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో.. ఏప్రిల్ 26న కొంతవరకు తగ్గుముఖం పట్టిన వార్త వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.9,823గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,004కి చేరింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.7,367గా ఉంది. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,230, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,040గా నమోదైంది. వెండి ధర కూడా ఒక కేజీకి రూ.1,10,800గా ఉంది.

Advertisement

Today Gold Price : దిగొస్తున్న పసిడి ధరలు.. కొనేవారు ఇదే మంచి అవ‌కాశం.. రోజు ఏప్రిల్ 26 గోల్డ్ ధరలు

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులేనని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశాలపై విధించిన దిగుమతి సుంకాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడంతో, ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరిగి, బంగారంలో పెట్టుబడి ఉపసంహరణలు చోటుచేసుకోవడంతో బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3250 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement

ఈ నేపథ్యంలో ఈ నెల 30న వచ్చే అక్షయ తృతీయ పర్వదినాన బంగారు ఆభరణాల కొనుగోలు తగ్గుతుందని జువెలరీ వ్యాపారులు భావిస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే బంగారం ధరలు దాదాపు రూ.30,000 వరకు పెరిగిన కారణంగా వినియోగదారులు ఆభరణాల కొనుగోలుకు వెనుకాడే అవకాశం ఉంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కనిపిస్తున్న ధరల తగ్గుదల తాత్కాలికమే అయి ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే మాత్రమే దీర్ఘకాలిక తగ్గుదల ఆశించవచ్చని వారు సూచిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి