Today Gold Price : మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు .. ఆదివారం ఎంత తులం ఎంత ఉందంటే..!!
ప్రధానాంశాలు:
Today Gold Price : మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు ..ఆదివారం ఎంత తులం ఎంత ఉందంటే..!!
Today Gold Price : ఏప్రిల్ 27 ఆదివారం నాడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,080కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,450గా ఉంది. అలాగే ఒక కిలో వెండి ధర రూ. 99,600గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక ట్రాయ్ ఔన్స్‌కు 3330 డాలర్లకు పెరగడం వల్ల దేశీయంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలలో స్పష్టత లేకపోవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై మాంద్యం మబ్బులు తొలగకపోవడం వంటి కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Today Gold Price : మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు .. ఆదివారం ఎంత తులం ఎంత ఉందంటే..!!
ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగనున్న అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారం కొనుగోళ్లపై భారీ ఆశలు పెట్టుకున్న వ్యాపారులు పెరిగిన ధరల వల్ల నిరాశ చెందుతున్నారు. గత ఏడాది అక్షయ తృతీయతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బంగారం ధరలు దాదాపు రూ.30,000 పెరిగాయి. చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధరలు రూ.99,000కు చేరుకోవడం కొనుగోలుదారుల్ని వెనక్కి తీసుకెళ్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో, వినియోగదారులు కొనుగోళ్లలో మితిమీరిన ఉత్సాహం చూపించే అవకాశాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలను పరిశీలిస్తే.. బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగితే బంగారానికి డిమాండ్ పెరగనుంది. అయితే, గ్లోబల్ మార్కెట్లు స్థిరపడినపుడు, పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు మరియు ట్రెజరీ బాండ్లవైపు మళ్లినపుడు బంగారం డిమాండ్ తగ్గే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. తాత్కాలికంగా, ధరల పరంగా బంగారం ప్రస్థానం ఇంకా పెరుగుదల దిశగా సాగుతుందని తెలుస్తోంది.