Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!
ప్రధానాంశాలు:
ఈరోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి ధరలను చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 97,600 గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,800 గా ఉంది. వెండి ధర కూడా ఈ మధ్య కాలంలో పెరుగుదల తర్వాత కొంత స్థిరంగా ఉంది, ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ. 1,08,000 పలుకుతోంది. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకిన తర్వాత స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. గడచిన 48 గంటల కాలంలో బంగారం ధరలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గులు గమనార్హం.

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!
Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర
ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న మార్పులు చెప్పవచ్చు. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ బంగారం ఫ్యూచర్స్ ధరల ఆధారంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర సుమారుగా 3300 డాలర్ల వద్ద ఉంది. ఇది గతంలో ఉన్న 3,500 డాలర్ల స్థాయి కంటే తక్కువ. ఈ తగ్గుదలకు ముఖ్య కారణంగా నిపుణులు ప్రాఫిట్ బుకింగ్‌ను పేర్కొంటున్నారు. అదే సమయంలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడటంతో, బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొద్దిగా తగ్గినట్లు తెలుస్తోంది.
ఇంకొక ముఖ్యమైన కారణం స్టాక్ మార్కెట్ పనితీరు. స్టాక్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తే, పెట్టుబడిదారులు బంగారం కంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గుతాయి. గతంలో స్టాక్ మార్కెట్ కుదేలైన సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే స్టాక్ మార్కెట్ మరియు బంగారం ధరల మధ్య అవినాభావ సంబంధం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సమకాలీన పరిస్థితుల ప్రకారం, బంగారం ధరలు ఇంకా కొంతకాలం వరకూ హెచ్చుతగ్గులకు లోనవుతాయని అంచనా.