Today Gold prices : తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold prices : తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Today Gold prices : తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..!

Today Gold prices : బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ నిలకడ లేకుండా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర కొంత తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.95,020కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర కూడా రూ.450 తగ్గి రూ.87,100 వద్ద కొనసాగుతోంది. ఈ తగ్గుదలతో వినియోగదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

Today Gold prices తగ్గిన బంగారం ధరలు ఎంతంటే

Today Gold prices : తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..!

ఇటీవల పెట్రోల్, డాలర్ మారకపు విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్పుల ప్రభావంతో బంగారం ధరలు నిత్యం మారిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న తగ్గుదల బంగారం కొనుగోలు చేసే వారికి మంచి అవకాశంగా మారవచ్చు. వివాహాలు, వేడుకల సమయంలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేసే ప్రజలకు ఇది స్వల్ప ఉపశమనం అని చెప్పవచ్చు.

కేవలం బంగారం ధరలే కాదు, వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.1000 తగ్గి ప్రస్తుతం రూ.1,08,000 వద్ద ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత ఎలా మారుతాయన్న దానిపై కొనుగోలు దారులు, వ్యాపారులు కళ్లుపెట్టారు. ఇదే విధంగా ధరలు క్రమంగా తగ్గితే, బంగారం కొనుగోలు తివాచీగా మారే అవకాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది