Home » Business » Today Gold Rate Good News For Gold Lovers Gold Price Has Dropped
Business

Today Gold Rate : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ ధర

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 31, 2025, 11:30 am
Advertisement

Today Gold Rate : ఈ రోజు మే 31వ తేదీ శనివారం బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పడిపోవడం గమనార్హం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.96,200గా నమోదయ్యింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,530కి చేరుకుంది. వెండి ధర కూడా రూ.99,744కు పరిమితమైంది. గతంలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని అంటే రూ.ఒక లక్ష దాటి పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ధరతో పోల్చితే దాదాపు రూ.5,000 వరకు తగ్గింది.

Advertisement

Today Gold Rate : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ ధర

Today Gold Rate  : భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు..ఈరోజు ఎంత ఉందంటే..!!

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోవడం, అంతేగాక అమెరికన్ డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గతంలో బంగారం ధరలు పెరిగేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు, ఆపై వచ్చిన న్యాయస్థాన తీర్పులు ప్రభావితమైనా, ప్రస్తుతం లాభాల స్వీకరణతో ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

అమెరికాలోని కామెక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఒక ఔన్స్‌కు 3280 డాలర్లకు చేరింది. గతంలో ఇది 3500 డాలర్ల వరకు ఉన్నది. పెట్టుబడిదారులు బంగారంపై పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, స్టాక్ మార్కెట్లలో వచ్చిన సానుకూల సంకేతాలు కూడా బంగారం ధరలను తగ్గించాయి. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశంగా మారింది. పండుగలు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తగ్గిన ధరలను ఎంతో మేలు జరగవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి