Home » Business » Today Gold Rate June 7th 2025
Business

Today Gold Rate : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 7, 2025 12:27 pm
Advertisement

Today Gold Rate : గోల్డ్ ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,630 తగ్గి 10 గ్రాములకు రూ. 97,970కి పరిమితమైంది. అదే విధంగా 22 క్యారెట్ల పసిడి కూడా రూ. 1,500 తగ్గి రూ. 89,800కు చేరుకుంది. గత కొద్దీ రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరట కలిగించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో ధరలు నమోదవుతున్నాయి.

Advertisement

Today Gold Rate : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్..!

Today Gold Rate : ఈ రోజు గోల్డ్ & సిల్వర్ రేట్లు- తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

ఇక వెండి ప్రియులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయం. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం 1 కిలో వెండి ధర రూ. 1,18,000 వద్దనే కొనసాగుతోంది. గోల్డ్ రేట్లు తగ్గినా వెండి ధరలు అదే స్థాయిలో ఉండటం అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పెండింగ్ డిమాండ్, పరిశ్రమల అవసరాలు వంటి అంశాలు వెండి ధరను స్థిరంగా ఉంచినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ధరల హెచ్చుతగ్గులు కనిపించాయి. శుక్రవారం నాటికి ఔన్స్ గోల్డ్ ధర 3,370 డాలర్లుగా ఉండగా, శనివారం నాటికి అది 60 డాలర్ల తగ్గుతూ 3,310 డాలర్లకు చేరింది. సిల్వర్ ధరలు మాత్రం తక్కువ మార్పులతో 36.00 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. ఈ మార్పులకు కారణంగా ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు, అమెరికా ఫెడ్ నిబంధనలు, డాలర్ బలహీనత వంటి అంశాలు ప్రముఖంగా నిలుస్తున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి