Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 June 2025, 10:40 am
  •  Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌... ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల రూపంలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోని అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, యుద్ధాలు, డాలర్ విలువ పెరుగుదల వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. 2024–25లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కానీ గత వారంలో పసిడి ధరలు కొంత తగ్గాయి. ఈరోజు జూన్ 9న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌... ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate  ఈరోజు బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..!!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.97,970గా ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.89,800 వద్ద కొనసాగుతోంది. గత వారం వీటి ధరలు రూ.1600 వరకూ తగ్గడం గమనార్హం. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3306 డాలర్లుగా కొనసాగుతోంది. భారతీయ రూపాయి విలువ పడిపోవడంతో బంగారం దిగుమతులకు ప్రభావం చూపుతోంది.

ఇక ముంబై, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,960గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.89,790గా నమోదైంది. ఇక వెండి విషయానికి వస్తే.. రూ.1,18,000కి కిలో ట్రేడవుతోంది. దీంతో బంగారం కొనుగోలుదారులు ప్రస్తుతం స్థిరమైన ధరల నేపథ్యంలో తమ కొనుగోళ్లపై ఆలోచన చేస్తున్నారు. త్వరలో వడ్డీ రేట్లు, డాలర్ మార్పిడి విలువల ఆధారంగా పసిడి ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp