Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

 Authored By suma | The Telugu News | Updated on :27 January 2026,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 “: దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే నినాదం మాటల్లోనే కాదు విధానాల్లోనూ కనిపించాలన్నదే అన్నదాతల ఆకాంక్ష. రైతులు పంటలు పండించకపోతే దేశ ఆహార భద్రతే ప్రశ్నార్థకమవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026–27 పై దేశవ్యాప్తంగా రైతులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే నిర్ణయాలు తీసుకుంటారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Budget 2026 27 అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్ 7 సంచలన నిర్ణయాలు

Budget 2026 – 27: అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 : రైతుల అంచనాలు ..సాగు లాభసాటిగా మారాలంటే

దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయినా వ్యవసాయ రంగానికి కేటాయింపులు తక్కువగానే ఉంటున్నాయనే విమర్శ ఉంది. ఈసారి కనీసం ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి వస్తుందని అంటున్నారు. మద్దతు ధర MSP పెంపు సాగు యంత్రాలపై అధిక రాయితీలు ఎరువులు–యూరియాపై మరింత సబ్సిడీ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గితేనే రైతుకు మిగులు ఆదాయం దక్కుతుందన్నది వారి అభిప్రాయం.

Union Budget 2026  విత్తనాల నుంచి మార్కెట్ వరకు..సమగ్ర మార్పుల అవసరం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యవసాయ నిపుణుడు అశోక్ బలియాన్ ఇటీవల జరిగిన ముందస్తు బడ్జెట్ సమావేశంలో కీలక సూచనలు చేశారు. రైతుల ఆదాయం పెరగాలంటే విత్తన పరిశోధనలపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమన్నారు. స్వదేశీ విత్తన రకాలు అభివృద్ధి అయితే విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. అలాగే కనీస మద్దతు ధర ప్రస్తుతం కేవలం 23 పంటలకే పరిమితమై ఉండటంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. అన్ని ప్రధాన పంటలకు MSP వర్తింపజేస్తే ప్రతి పంటకు గ్యారెంటీ ధర లభించి నష్టాలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు. కృషీ విజ్ఞాన కేంద్రాలు కేవలం సాంకేతిక సలహాలకే కాకుండా మార్కెట్ ధరలపై అవగాహన కల్పించేలా పనిచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

Union Budget 2026 : మౌలిక సదుపాయాలు..సేంద్రీయ సాగుపై దృష్టి

పంట కోత అనంతరం జరిగే నష్టాలు రైతులకు పెద్ద భారంగా మారాయి. దీనిని తగ్గించేందుకు ఆధునిక గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. ఇలా మౌలిక వసతులు పెరిగితే రైతులు తమ పంటను నిల్వ చేసుకుని ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల పాత్ర కూడా తగ్గుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు FPOలు బలోపేతం కావాలంటే ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట నిబంధనలను సులభతరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమూహ సాగు ద్వారా రైతుల చర్చా శక్తి పెరుగుతుంది. అంతేకాదు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు చేస్తున్న రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రసాయన రహిత సాగు వల్ల పర్యావరణం, ప్రజారోగ్యం రెండూ మెరుగుపడతాయని వారు చెబుతున్నారు. ఈ బడ్జెట్ తమ కష్టాలకు పరిష్కారం చూపి కొత్త ఆశలను నింపుతుందని అన్నదాతలు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది