Gold and silver Rate Today March 9 : పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 9 March 2026, 9:30 am

Gold and silver Rate Today March 9 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ కొనుగోలుదారులను బెంబేలెత్తించిన పసిడి ధరలు, ఈరోజు మార్చి 9 న కాస్త శాంతించాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోలిస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. రికార్డ్ గరిష్ఠాల నుంచి ఏకంగా రూ.19 వేలు తక్కువ స్థాయిలోనే ట్రేడవుతుండటం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. రానున్న రోజుల్లో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నందున, కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Gold and silver Rate Today March 9 : పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

Gold and silver Rate Today March 9 : పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

Gold and silver Rate Today March 9 గ్లోబల్ మార్కెట్‌లో తగ్గుముఖం.. కారణాలివే!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు ఉండవని ఇరాన్ ప్రకటించినప్పటికీ, తమపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పడంతో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. డాలర్ విలువ పుంజుకోవడం కూడా బంగారం రేట్లపై ప్రభావం చూపుతోంది. అయితే, ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు 72 డాలర్లకు పైగా క్షీణించి, ఔన్సుకు 5077 డాలర్ల వద్దకు దిగివచ్చింది. అదే విధంగా స్పాట్ సిల్వర్ రేటు కూడా 4.37 శాతం మేర పతనమై, ఔన్సుకు 80.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Gold and silver Rate Today March 9 దేశీయ ప్రధాన నగరాల్లో నేటి (మార్చి 9) బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ కు అనుగుణంగా దేశీయంగా కూడా పసిడి రేట్లలో స్థిరత్వం కనిపిస్తోంది. తులం బంగారంపై కేవలం రూ. 10 మేర స్వల్ప మార్పు మాత్రమే చోటుచేసుకుంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు (ఆభరణాల తయారీకి వాడేది), 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) 10 గ్రాముల బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,990 కాగా, 24 క్యారెట్ల ధర రూ.1,63,630 వద్ద స్థిరంగా ఉంది.

విజయవాడ: 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,49,990, అలాగే 24 క్యారెట్ల ధర రూ.1,63,630 గా కొనసాగుతోంది.

ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,49,990, ఇక 24 క్యారెట్ల రేటు రూ.1,63,630 వద్ద ఉంది.

బెంగళూరు: ఇక్కడ కూడా 22 క్యారెట్ల ధర రూ.1,49,990, 24 క్యారెట్ల ధర రూ.1,63,630 వద్ద అమ్ముడవుతోంది.

కేరళ: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,49,990 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,63,630.

చెన్నై: చెన్నైలో కాస్త ఎక్కువ ధరలు నమోదయ్యాయి. 22 క్యారెట్ల ధర రూ.1,50,490, 24 క్యారెట్ల ధర రూ.1,64,170 గా ట్రేడవుతోంది.

ఢిల్లీ: దేశ రాజధానిలో 22 క్యారెట్ల బంగారం రూ.1,50,014 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.1,63,790 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు కూడా కూల్‌ కూల్!

బంగారంతో పాటు వెండి రేటు సైతం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. గత వారం రోజుల నుంచి కిలో వెండిపై ఏకంగా రూ.30 వేలకు పైగా తగ్గడం విశేషం. ఈరోజు వెండి ధరపై కేవలం రూ.100 మాత్రమే తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ మార్కెట్లలో ఒక కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో (ముంబై, ఢిల్లీ తదితర) కిలో వెండి రేటు రూ.2,84,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6-7 గంటల సమయంలో నమోదైనవి. బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఈ ధరలు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి మారే అవకాశం ఉంటుంది. అలాగే స్థానికంగా ఉండే పన్నులు, జీఎస్టీ GST, తరుగు, మజూరీ ఛార్జీల ఆధారంగా షోరూమ్‌లలో తుది ధరల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి మీరు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు మీకు దగ్గరలోని జ్యువెలరీ షాపులో కచ్చితమైన ధరను తెలుసుకోవడం ఉత్తమం.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp