Business Loan : బిజినెస్ కోసం లోన్ తీసుకుంటున్నారా? దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Business Loan : చాలామంది ఏదైనా బిజినెస్ పెట్టాలని అనుకుంటారు. ఆ బిజినెస్ పెట్టుబడి కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తమ దగ్గర మంచి ఐడియా ఉన్నా కూడా బిజినెస్ చేసేందుకు డబ్బులు లేక అక్కడా ఇక్కడా తిరుగుతుంటారు. వాళ్లను వీళ్లను అడుగుతుంటారు. అయితే.. బ్యాంకులు కూడా బిజినెస్ కోసం లోన్లు ఇస్తుంటాయి కానీ.. అది కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకే.. బ్యాంకుల చుట్టూ తిరగలేక బ్యాంకు నుంచి రుణం తీసుకోరు చాలామంది.కానీ.. కొత్త వ్యాపారం పెట్టాలనుకునే వాళ్లు బ్యాంకు లోను తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
వాటి ద్వారా ఉండే ప్రయోజనాలు తెలియక చాలామంది లోన్ తీసుకోరు కానీ.. వ్యాపారం కోసం లోన్ తీసుకుంటే.. ఆ యజమానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా బ్యాంకులు పర్సనల్ లోన్ లాంటివి తీసుకుంటే ఎక్కువ వడ్డీ రేట్లు వేస్తాయి కానీ.. వ్యాపార లోన్ కు తక్కువ వడ్డీ రేట్లనే తీసుకుంటూ ఉంటాయి. అది కూడా ఒక కంపెనీగా రుణం తీసుకుంటే ఇంకా బెటర్. సమయానికి రుణాల చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
Business Loan : తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి
సిబిల్ స్కోర్ పెరిగితే భవిష్యత్తులో తీసుకునే రుణాలపై తక్కువ వడ్డీ పడుతుంది. అది రుణ గ్రహితకు తక్కువ వడ్డీకే రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది.మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు.. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజును కూడా తీసుకోవు. బిజినెస్ లోన్ తో పాటు టర్మ్ లోన్, మర్చంట్ లోన్ కూడా తీసుకోవచ్చు. అటువంటి లోన్ తీసుకున్న వాళ్లు ఆ లోన్ పై చెల్లించే వడ్డీని ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు చేసుకోవచ్చు. ఇలా.. బిజినెస్ కోసం లోన్ తీసుకుంటే పలు రకాలుగా ప్రయోజనాలను పొందొచ్చు.