Business idea : బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం.. నెలకు రూ.22 వేల జీతం.. కానీ ఆరునెలల్లోనే ఉద్యోగలో ఏదో వెలితి.. ఇంకా ఏదో చెయ్యాలన్న కోరికతో ఉద్యోగాన్ని వదిలి.. కేవలం రూ.5 వేల పెట్టుబడితో.. లక్షలు సంపాదిస్తున్నాడు.. సాయి వర్ధన్…బెంగళూరులో ఉన్న సాయి.. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను గ్రహించారు. అంతేకాకుండా, 2020 వేసవిలో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను అమ్మడానికి పడ్డ కష్టాలు చూశాడు. రైతులు తమ మామిడి పండ్లను ఆన్‌లైన్‌లో విక్రయించడంలో సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.’నేను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వ్యాపార ఖాతాలను సృష్టించడానికి రూ. 5,000 పెట్టుబడి పెట్టాను.
సేంద్రీయంగా పండించిన మామిడి పండ్ల ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఉంచి.. ఫార్మ్–టు–హోమ్ డెలివరీ చెసేవాడిని. సీజన్లో మామడి పండ్లకు బాగా గిరాకీ ఉంటుందని అర్ధమైంది.. దీన్ని వ్యాపారంగా మర్చాలనుకున్నా.. ఊహించినట్లుగానే, కస్టమర్ల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. అప్పుడు నా ఫ్రెండ్ ఫామ్ ఫుడ్‌తో స్టార్టప్‌ను ప్రారంభించమని ఐడియా ఇచ్చాడు.సాయికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర,తమిళనాడు,యుఎస్, యుకె లో కస్టమర్స్ ఉన్నారు. యుఎస్, యుకె కు ఆర్డర్లు పంపాలనే ఆలోచనలో ఉన్నాడు.“మా అమ్మ వేసవిలో ఊరగాయలు చేసి స్నేహితులకు, బంధువులకు పంచేది.
నేను కొన్ని నెలలపాటు మార్కెట్లో ఊరగాయలకు ఉన్న డిమాండ్‌ను అధ్యయనం చేశాను మరియు ఫార్మ్ ఆర్గ్ ఫుడ్స్‌ను ప్రారంభించాను.” సాయి.తన పోటీదారుల నుండి ప్రత్యేకంగా ఉండటానికి, సాయి.. క్యారెట్, వంకాయ, క్యాలీఫ్లవర్, టొమాటో, ఇతర కూరగాయలతో తయారు చేసిన సేంద్రీయ ఊరగాయలను సరఫరా చేస్తాడు.సేంద్రీయ పద్ధతిలో పండించే వాటినే మేము వాడతాం. నేను పచ్చడి పట్టే ప్రక్రియ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఉంచాను, ఉత్పత్తుల యొక్క ప్రామాణికత గురించి వినియోగదారులకు హామీ ఇచ్చాను. అదనంగా, అవి రుచికి కూడా బాగుంటాయి. ఈ వెంచర్ లో 20 మంది మహిళలను చేర్చుకుని.. వారికి మంచి జీతం ఇస్తున్నాను. ‘- సాయిప్రస్తుతం సాయి ఖర్చులు పోనూ.. నెలకు 70,000 వేలు సంపాదిస్తున్నాడు. అతని జీతం కంటే ఇది మూడింతలు ఎక్కువ.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.