Business Idea : కార్పొరేట్ జాబ్ వదిలేసి కేవలం 5 వేలు పెట్టుబడి పెట్టాడు.. ఇప్పుడు నెలకు 70 వేలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : కార్పొరేట్ జాబ్ వదిలేసి కేవలం 5 వేలు పెట్టుబడి పెట్టాడు.. ఇప్పుడు నెలకు 70 వేలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా?

 Authored By jyothi | The Telugu News | Updated on :7 February 2022,9:00 am

Business idea : బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం.. నెలకు రూ.22 వేల జీతం.. కానీ ఆరునెలల్లోనే ఉద్యోగలో ఏదో వెలితి.. ఇంకా ఏదో చెయ్యాలన్న కోరికతో ఉద్యోగాన్ని వదిలి.. కేవలం రూ.5 వేల పెట్టుబడితో.. లక్షలు సంపాదిస్తున్నాడు.. సాయి వర్ధన్బెంగళూరులో ఉన్న సాయి.. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను గ్రహించారు. అంతేకాకుండా, 2020 వేసవిలో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను అమ్మడానికి పడ్డ కష్టాలు చూశాడు. రైతులు తమ మామిడి పండ్లను ఆన్‌లైన్‌లో విక్రయించడంలో సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.’నేను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వ్యాపార ఖాతాలను సృష్టించడానికి రూ. 5,000 పెట్టుబడి పెట్టాను.

సేంద్రీయంగా పండించిన మామిడి పండ్ల ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఉంచి.. ఫార్మ్టుహోమ్ డెలివరీ చెసేవాడిని. సీజన్లో మామడి పండ్లకు బాగా గిరాకీ ఉంటుందని అర్ధమైంది.. దీన్ని వ్యాపారంగా మర్చాలనుకున్నా.. ఊహించినట్లుగానే, కస్టమర్ల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. అప్పుడు నా ఫ్రెండ్ ఫామ్ ఫుడ్‌తో స్టార్టప్‌ను ప్రారంభించమని ఐడియా ఇచ్చాడు.సాయికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర,తమిళనాడు,యుఎస్, యుకె లో కస్టమర్స్ ఉన్నారు. యుఎస్, యుకె కు ఆర్డర్లు పంపాలనే ఆలోచనలో ఉన్నాడు.“మా అమ్మ వేసవిలో ఊరగాయలు చేసి స్నేహితులకు, బంధువులకు పంచేది.

youngster sai vardhan earning lakhs of rupees with the investment of 5000

youngster sai vardhan earning lakhs of rupees with the investment of 5000

నేను కొన్ని నెలలపాటు మార్కెట్లో ఊరగాయలకు ఉన్న డిమాండ్‌ను అధ్యయనం చేశాను మరియు ఫార్మ్ ఆర్గ్ ఫుడ్స్‌ను ప్రారంభించాను.” సాయి.తన పోటీదారుల నుండి ప్రత్యేకంగా ఉండటానికి, సాయి.. క్యారెట్, వంకాయ, క్యాలీఫ్లవర్, టొమాటో, ఇతర కూరగాయలతో తయారు చేసిన సేంద్రీయ ఊరగాయలను సరఫరా చేస్తాడు.సేంద్రీయ పద్ధతిలో పండించే వాటినే మేము వాడతాం. నేను పచ్చడి పట్టే ప్రక్రియ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఉంచాను, ఉత్పత్తుల యొక్క ప్రామాణికత గురించి వినియోగదారులకు హామీ ఇచ్చాను. అదనంగా, అవి రుచికి కూడా బాగుంటాయి. ఈ వెంచర్ లో 20 మంది మహిళలను చేర్చుకుని.. వారికి మంచి జీతం ఇస్తున్నాను. ‘- సాయిప్రస్తుతం సాయి ఖర్చులు పోనూ.. నెలకు 70,000 వేలు సంపాదిస్తున్నాడు. అతని జీతం కంటే ఇది మూడింతలు ఎక్కువ.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది