సాధారణం ఎనిమిదేళ్ల పిల్లాడు ఎవరైనా ఏం చేస్తాడు.. హాయిగా తోటి స్నేహితులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతుంటాడు. కానీ, ఈ బాలుడు మాత్రం అలా కాదండోయ్.. ఎనిమిదేళ్లకే కుటుంబ భారం మీదేసుకున్నాడు. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని గంగుడుపల్లి గ్రామానికి చెందిన బండి పాపిరెడ్డికి వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన రేవతితో పదేళ్ల కిందట మ్యారేజ్ అయింది. వీరికి గోపాలకృష్ణారెడ్డి, హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి ముగ్గురు పిల్లలు. అయితే, పాపిరెడ్డికి చిన్నతనంలోనే కంటిచూపు పోయింది. ఇక రేవతి పుట్టుకతోనే అంధురాలు.
సర్కారు అందించే పింఛన్‌పైనే ఆధారపడి వీరు జీవనం సాగిస్తున్నారు. కాగా, ప్రభుత్వం నుంచి వచ్చే సాయం సరిపోకపోవడంతో ఎనిమిదేళ్ల గోపాలకృష్ణరెడ్డిపైన కుటుంబ భారం పడింది. ఈ పిల్లాడు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటిని పోషించేందుకుగాను ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు సదరు బాలుడు. స్కూల్ పూర్తయిన తర్వాత ఆటో తోలుకుంటా తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు గోపాలకృష్ణరెడ్డి. కాగా, ఈ విషయం తెలుసుకుని కలెక్టర్ పాపిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లల చదువులతో పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ తెలిపారు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.