Home » Andhra Pradesh » Ap Minister Peddireddy And Leaders Participated In Kaanipaka Ganesh Celebrations
andhra pradesh

Chittoor.. కాణిపాక గణనాథుడికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

Authored By
praveen T
The Telugu News | Published on: September 10, 2021, 10:19 pm
Advertisement

జిల్లాలోని కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడికి శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు శాసన సభ్యుడు ఎంఎస్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్రత సంకల్పం పూజా కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కరోనా బారి నుంచి దేశం రాష్ట్రం విముక్తి పొందాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.

Advertisement

కొవిడ్ బారిన పడుకుండా ఉండేందుకు ప్రజలు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేందుకుగాను పరిమితుల విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంలో కొందరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు అనుమతులతో వినాయక చవితి సంబురాలు స్టార్ట్ అయ్యాయి.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి