Home » Andhra Pradesh » My India Foundation Distributed Ambulance For Poor People
andhra pradesh

East godavari..ప్రతీ ఒక్కరు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి

Authored By
praveen T
The Telugu News | Published on: September 10, 2021, 10:16 pm
Advertisement

నేటి ఉరుకుల పరుగుల జీవనంలో ప్రజలు ఎవరి పనిలో వారే ఉండిపోతున్నారని, ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సామాజకి బాధ్యత, స్పృహ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన వారు మాత్రమే సొసైటీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటారని చెప్పారు. రాజమండ్రి ప్రకాశ్ నగర్‌లో మై ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పేదల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసును శుక్రవారం ఎమ్మెల్యే జక్కంపూడి ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సమాజ అభివృద్ధికి పాటు పడాలని కోరారు.

Advertisement

అందరూ సమాజం కోసం తిరిగి ఇచ్చే సంస్కృతిని అలవర్చుకోవాలని, తోటి వారి కోసం, పేదల కోసం తమ వంతు సాయం, తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పేదల కోసం ఉచిత అంబులెన్స్ అందజేసి, సర్వీసు స్టార్ట్ చేసి మై ఇండియా ఫౌండేషన్ వారిని ఎమ్మెల్యే జక్కంపూడి అభినందించారు. కార్యక్రమంలో మై ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి