Ayodhya Ram Mandir : జనవరి 22 – 2024 ఈరోజుదేశ హిందువులందరికీ ఎంతో విశిష్టమైన రోజుగా చెప్పాలి. ఇక ఈరోజు ఒకవైపు బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవం జరుగుతుంటే..మరో వైపు తమ ఇంటికి బాల రాముని తమ బిడ్డల రూపంలో అదే సమయానికి ఆహ్వానించాలని తపనతో చాలామంది మాతృమూర్తులు తహతలాడారు. ఇక అది కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే సాధ్యం కాబట్టి పట్టుబట్టి మరీ చాలామంది ప్రసవాలు జరిపించుకున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో సోమవారం రోజు రాముడి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆరోజు బాల రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.
అయితే బాల రాముని విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఓ ముస్లిం గర్భిణీ ప్రసవించడం జరిగింది. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.అయితే బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట సమయంలో తన భార్యకు బిడ్డ పుట్టడంతో భర్త పుట్టిన బిడ్డకు రామ్ రహీం అని పేరు నామకరణం చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ లోన ఫిరోజాబాద్ ఆసుపత్రిలో సదరు గర్భిణీ ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి రావడం జరిగింది.ఈ సమయంలోనే సరిగ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టిస్తుండగా ఆమె ప్రసరించింది. ఇక బిడ్డ తండ్రి రామ్ రహీం అని పేరు పెట్టడంతో హిందూ ముస్లింల మధ్య ఐక్యత ఉండటానికి మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని నిదర్శించేలా ఆ నామకరణం చేసినట్లు తండ్రి వెల్లడించారు.
ఇక రాముని విగ్రహ ప్రతిష్ట సమయంలోనే మనవడు జన్మించాడని రెండు మతాలవారు ఐక్యంగా అన్నదమ్ముల కలిసి ఉండేలా ఆ భావాన్ని అర్థం చేసుకునేలా ఆ బిడ్డకు రామ్ రహీమని పేరు పెట్టినట్లుగా ఆ బిడ్డ బామ్మ హుస్నా భాను చెప్పుకొచ్చారు.బిడ్డకు జన్మ ఇచ్చిన మహిళ కూడా తన కుమారుడికి రామ్ రహీం అని పేరు పెట్టడాన్ని తాను సమ్మతిస్తున్నానని తెలియజేసింది. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మీడియా వరకు చేరడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా రామ్ రహీం అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.