Ayodhya Ram Mandir : రాముని ప్రాణ ప్రతిష్ట సమయం లోనే బిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ…పేరు ఏమని పెట్టారో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ayodhya Ram Mandir : రాముని ప్రాణ ప్రతిష్ట సమయం లోనే బిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ…పేరు ఏమని పెట్టారో తెలుసా…!

Ayodhya Ram Mandir : జనవరి 22 – 2024 ఈరోజుదేశ హిందువులందరికీ ఎంతో విశిష్టమైన రోజుగా చెప్పాలి. ఇక ఈరోజు ఒకవైపు బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవం జరుగుతుంటే..మరో వైపు తమ ఇంటికి బాల రాముని తమ బిడ్డల రూపంలో అదే సమయానికి ఆహ్వానించాలని తపనతో చాలామంది మాతృమూర్తులు తహతలాడారు. ఇక అది కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే సాధ్యం కాబట్టి పట్టుబట్టి మరీ చాలామంది ప్రసవాలు జరిపించుకున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Ayodhya Ram Mandir : రాముని ప్రాణ ప్రతిష్ట సమయం లోనే బిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ...పేరు ఏమని పెట్టారో తెలుసా...!

Ayodhya Ram Mandir : జనవరి 22 – 2024 ఈరోజుదేశ హిందువులందరికీ ఎంతో విశిష్టమైన రోజుగా చెప్పాలి. ఇక ఈరోజు ఒకవైపు బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవం జరుగుతుంటే..మరో వైపు తమ ఇంటికి బాల రాముని తమ బిడ్డల రూపంలో అదే సమయానికి ఆహ్వానించాలని తపనతో చాలామంది మాతృమూర్తులు తహతలాడారు. ఇక అది కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే సాధ్యం కాబట్టి పట్టుబట్టి మరీ చాలామంది ప్రసవాలు జరిపించుకున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో సోమవారం రోజు రాముడి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆరోజు బాల రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

అయితే బాల రాముని విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఓ ముస్లిం గర్భిణీ ప్రసవించడం జరిగింది. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.అయితే బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట సమయంలో తన భార్యకు బిడ్డ పుట్టడంతో భర్త పుట్టిన బిడ్డకు రామ్ రహీం అని పేరు నామకరణం చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ లోన ఫిరోజాబాద్ ఆసుపత్రిలో సదరు గర్భిణీ ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి రావడం జరిగింది.ఈ సమయంలోనే సరిగ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టిస్తుండగా ఆమె ప్రసరించింది. ఇక బిడ్డ తండ్రి రామ్ రహీం అని పేరు పెట్టడంతో హిందూ ముస్లింల మధ్య ఐక్యత ఉండటానికి మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని నిదర్శించేలా ఆ నామకరణం చేసినట్లు తండ్రి వెల్లడించారు.

Ayodhya Ram Mandir రాముని ప్రాణ ప్రతిష్ట సమయం లోనే బిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళపేరు ఏమని పెట్టారో తెలుసా

Ayodhya Ram Mandir : రాముని ప్రాణ ప్రతిష్ట సమయం లోనే బిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ…పేరు ఏమని పెట్టారో తెలుసా…!

ఇక రాముని విగ్రహ ప్రతిష్ట సమయంలోనే మనవడు జన్మించాడని రెండు మతాలవారు ఐక్యంగా అన్నదమ్ముల కలిసి ఉండేలా ఆ భావాన్ని అర్థం చేసుకునేలా ఆ బిడ్డకు రామ్ రహీమని పేరు పెట్టినట్లుగా ఆ బిడ్డ బామ్మ హుస్నా భాను చెప్పుకొచ్చారు.బిడ్డకు జన్మ ఇచ్చిన మహిళ కూడా తన కుమారుడికి రామ్ రహీం అని పేరు పెట్టడాన్ని తాను సమ్మతిస్తున్నానని తెలియజేసింది. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మీడియా వరకు చేరడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా రామ్ రహీం అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది