Coconut : ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టకూడదా..? కాదని కొడితే జరిగేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coconut : ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టకూడదా..? కాదని కొడితే జరిగేది ఇదే…!

 Authored By tech | The Telugu News | Updated on :13 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Coconut : ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టకూడదా..? కాదని కొడితే జరిగేది ఇదే...!

Coconut  : కొన్ని ఆలయాల్లో హిందూ సాంప్రదాయ కొబ్బరికాయలు మహిళలు కొట్టకూడదని అంటుంటారు. ఈ ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ ఆచారం కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ఆలయాల్లో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు. అయితే మహిళలు కొబ్బరికాయలు కొట్టకూడదని ఎందుకంటారు. పూజారి కార్యక్రమాల్లో దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయలను ఎందుకు కొట్టకూడదు. దీని వెనుక అసలుఅర్థం ఏంటో తెలుసుకుందాం.

కొబ్బరికాయ లేదా టెంకాయ భారతదేశంలో ఈ కొబ్బరికాయలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. అంతే కాకుండా హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టి న కూడా ముందుగా కొబ్బరికాయ కొట్టి అంతా మంచే జరగాలని కోరుకుంటూ కొడతారు. కొన్ని చోట్ల మహిళలు కొబ్బరికాయలు పగలకొట్టడం నిషేధించబడింది. ఎందుకంటే కొబ్బరి ఒక విత్తనం స్త్రీలు సంతానానికి కారకులు. వారు ఒకే విత్తనం నుంచి సంతానాన్ని కలిగి ఉంటారు. విష్ణువు తల్లి లక్ష్మి భూమిపై కొబ్బరి చెట్లను నాటినట్లు చెబుతారు. అయితే భారత దేశంలో హిందువులు కొన్ని ప్రదేశాలలో మహిళలను కొబ్బరికాయలు కొట్టారు. చాలా తక్కువ మాత్రమే కొడుతుంటారు. ఇలా కొట్టడం వల్ల వారి జీవితంలో అనేక సమస్యలను ఎదురవుతాయి.

అందుకే దేవాలయాల్లో మతపరమైన వేడుకల్లో కొబ్బరికాయ కొట్టడం ద్వారా దేవతలకు నైవేద్యం సమర్పించినట్లుగా ఆశీర్వాదం కోసం అహంకారాన్ని తొలగించేదిగా సూచిస్తుంది.స్త్రీలతో పోలిస్తే పురుషులు బలవంతులని ఆ నాటి కాలంలో భావించారు. అలా కొబ్బరి కాయలను పురుషులు మాత్రమే కొట్టేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు మహిళలు కూడా పురుషులతో సమానం అనే రోజులు వచ్చాయి. దీంతో ఇప్పటికే చాలా ఆలయంలో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు.. మహిళలు కొబ్బరికాయలు కొట్టకూడదు అని ప్రత్యేక నియమం కాని నిషేధం కానీ లేదు.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది