Tulsi Plant : ఈ వస్తువులను తులసి మొక్క దగ్గర పెడుతున్నారా… అయితే ఇక మీకు కష్టాలు తప్పవు…!
Tulsi Plant : తులసి మొక్క ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిన విషయమే.. మన హిందూ సమాజంలో చాలామంది ఇంట్లో తులసి మొక్కను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఈ తులసి మొక్కని లక్ష్మీ స్వరూపంగా కూడా ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేక సందర్భంలో తప్పకుండా తులసికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి దళాల మాలను శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తూ ఉంటారు. విష్ణు భక్తికి తులసి దళాల ప్రీతికరమైనది. ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టిన కలగని ఫలితం విష్ణుమూర్తికి ఒక్క తులసిదళం సమర్పిస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చు అని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. రుక్మిణి శ్రీకృష్ణుని గెలుచుకున్నది కూడా కేవలం ఒక్క తులసీదళం తోనే ఈ తులసి కోట ఉండే చోటులో
తీర్థ స్థలమని గంగా తీరంలో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే తులసి దర్శనం చేసుకుంటే ఎన్నో తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన ఫలితం పొందుతారట. అలాగే తులసిని పెట్టుకున్న రోజు నీటిని పోసిన మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు తెలియజేయడం జరిగింది. తులసి మొక్క విషయంలో ఈ పరిహారాలను పాటించడం తప్పనిసరి..
రాత్రి వేళల్లో స్నానం చేయకుండా పాదరక్షలతో ఉన్నప్పుడు తులసి మొక్కను అస్సలు ముట్టుకోవద్దు. తులసి మొక్కను తూర్పున లేదా ఈశాన్య దిక్కున మాత్రమే పెట్టుకోవాలి. సూర్యరశ్మి తగిలే విధంగా చూసుకోవాలి. తులసి మొక్క పెట్టుకునే చోట పరిసరాలలో చెప్పులు అసలు పెట్టకూడదు. ఈ విధంగా ఉంచితే తులసికి మాత్రమే కాదు
లక్ష్మి అమ్మవారిని కూడా అవమానపరిచినట్లే కాబట్టి ఎప్పుడు ఆ ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం కాబట్టి తులసి ఆరాధన చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. తులసి దగ్గరే ఎప్పుడు చీపిరి పెట్టవద్దు.. చీపిరి పెడితే అటు విష్ణుమూర్తిని ఇటు లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అవుతుంది. కాబట్టి ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి. చాలామంది తులసి మొక్క దగ్గర శివలింగం పెడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు. తులసి పూర్వజన్మలో జలేంద్రుని అనే రాక్షసుడు భార్య బృంద ఈ రాక్షసున్ని శివుడే వధించాడు. కాబట్టి ఎప్పుడు కూడా శివలింగం
దగ్గర తులసి దళాన్ని అస్సలు పెట్టవద్దు..తులసి మొక్క పరిసరాలలో చెత్త బుట్టలు కూడా పెట్టవద్దు. ఈ విధంగా ఉంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. తులసి ఆధ్యాత్మిక సాధనకే కాకుండా ఆరోగ్య రక్షణ కూడా సహాయపడుతుంది. తులసి జ్వరానికి మంచి మందు గొంతు నొప్పికి తులసి ఆకులు వేసి ఉడికించి ఆ నీటిని పుక్కిటపడితే ఉపశమనం కలుగుతుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే చిటికలో జ్వరం తగ్గిపోతుంది. ద్వాదశి అమావాస్య పున్నమి రోజులలో ఆది, మంగళ, గురు, శుక్రవారాలలో తులసి ఆకుల్ని అస్సలు తెంపరాదు. ఉత్తర తూర్పు అభిముఖంగా నిలబడి మా