Plants Vastu Tips : మీరు ఈ చెట్టును ఇంట్లో పెంచుతున్నారా ? అయితే గొడవలు జరగటం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Plants Vastu Tips : మీరు ఈ చెట్టును ఇంట్లో పెంచుతున్నారా ? అయితే గొడవలు జరగటం ఖాయం…!

Plants Vastu Tips : మనం ఇంట్లో ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే కొన్ని చెట్లు వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి కొన్ని చెట్లు వల్ల ఆరోగ్యానికి ఉపయోగాలు ఉంటాయి అయితే కొన్ని చెట్లు పెంచితే ఇంట్లో గొడవలు జరగడం ఖాయమని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు.. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంతమంది తులసి మొక్కను తూర్పు దిశలో కానీ ఉత్తర దశలో కానీ పెంచుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా దక్షిణ దిశలో పెంచడం […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Plants Vastu Tips : మీరు ఈ చెట్టును ఇంట్లో పెంచుతున్నారా ? అయితే గొడవలు జరగటం ఖాయం...!

Plants Vastu Tips : మనం ఇంట్లో ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే కొన్ని చెట్లు వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి కొన్ని చెట్లు వల్ల ఆరోగ్యానికి ఉపయోగాలు ఉంటాయి అయితే కొన్ని చెట్లు పెంచితే ఇంట్లో గొడవలు జరగడం ఖాయమని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు.. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంతమంది తులసి మొక్కను తూర్పు దిశలో కానీ ఉత్తర దశలో కానీ పెంచుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా దక్షిణ దిశలో పెంచడం చాలా మేలు చేస్తుంది. ఎప్పుడు కూడా తులసి మొక్క ను దక్షిణ దిశలో ఉండేలాగా చూసుకోవాలి. దక్షిణ దిశలో యముడు యొక్క ప్రభావం అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి తులసి మొక్కను ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఈ చెట్టు ఇంటి ముందు పెట్టి ప్రతిరోజు దాన్ని పూజించాలి.

మీ ఇంట్లో కనుక వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలో ఉంచాలి. ముఖ్యంగా కొన్ని పరిహారాలకి ఆరోగ్య ప్రయోజనాలకి ఈ యొక్క మనీ ప్లాంట్ మొక్క అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అలోవెరా మొక్క కూడా ఇంటికి వాస్తు పరంగా చాలా అనుకూలమైనది. మరియు ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్న మొక్క తులసి మరియు అలోవెరా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండవలసిన మొక్కల్లో అలోవెరా అలాగే తులసి మొక్క అనేది చాలా ప్రధానమైనవి.. అలాగే ఎప్పుడు కూడా పాలుకారే మొక్కలు ఇళ్ళ ల్లో ఉంటే కనుక దురదృష్టం. కొన్ని మొక్కలకి పాలు కారే స్వభావం అనేది ఉంటుంది.

కాబట్టి ఈ మొక్కలు ఎంత అందంగా కనిపించినా కానీ వాస్తు ప్రకారం మీరు వాటిని ఇంటికి దూరంగా ఉంచడమే మంచిది. ఒక్క తెల్ల జిల్లేడు చెట్టు మినహాయించి మిగతా పాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు. ఇలా పాలు ఉత్పత్తి చేసే మొక్కలు దురదృష్టాన్ని తీసుకుని వస్తాయి. దురదృష్టాన్ని ఆకర్షించడానికి కారణం అవుతుంది. గులాబీ లోపలికి ప్రవహించే ప్రతికూల శక్తితో పోరాడుతుందని ఒక నమ్మకం. కాబట్టి ఇంట్లో పెంచాలి. ఇంకా చాలా మొక్కలు చెట్లు ఇళ్లలో పెంచకూడదు. ముఖ్యంగా కాక్టస్ మొక్కను ఇంట్లో పెంచినట్లయితే ఇంట్లో నిత్యం గొడవలు కావడం ఖాయం కావున ఈ మొక్కను ఇంట్లో పెంచడం కంటే బయట పెంచుకోవడం మంచిది. అలాగే స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అభివృద్ధి లు జరుగుతాయి. అలాగే ఇంట్లో ప్రతికూల వాతావరణ ఏర్పడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది