Trees : వామ్మో… ఈ చెట్లు మీ ఇంటి ఆవరణలో పెంచుతున్నారా..? తీసివేయకపోతే ఈ సమస్యల్లో పడక తప్పదు..!
ప్రధానాంశాలు:
Trees : వామ్మో... ఈ చెట్లు మీ ఇంటి ఆవరణలో పెంచుతున్నారా..? తీసివేయకపోతే ఈ సమస్యల్లో పడక తప్పదు..!
Trees : సహజంగా అందరూ ఇంట్లో చాలా రకాల మొక్కలు పెంచుతూ ఉంటారు. కొన్ని పూల మొక్కలు కొన్ని పండ్ల మొక్కలు ఇలా ఎన్నో రకాల మొక్కల్ని పెంచుతూ ఉంటారు. ఇంట్లో ఈ మొక్కలుంటేనే కుటుంబ శ్రేయస్సు బాగుంటుంది. కొన్ని మొక్కలను నిర్దిష్ట దిశలో నాటినట్లయితే విజయం, అదృష్టం కలుగుతాయి. సంపద ను ఆకర్షించడానికి మొక్కలు విషయంలో పాటించాల్సిన వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Trees ఇండోర్ ప్లాంట్స్ కోసం వాస్తు టిప్స్
గదిలో చిన్నపాటి వెదురు మొక్కలు పెంచడం మంచిది. ఇది అదృష్టం సంతోషం ప్రశాంతత వాతావరణం అందిస్తాయి. బెడ్ రూమ్ కి తూర్పు లేదా దక్షిణ భాగంలో స్నేక్ ప్లాంట్ పెంచాలి. ఇవి నెగిటివ్ ఎనర్జీని కాలుష్య కారకాలను పీల్చుకొని ఇంటి లోపలి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి ఆగ్నేయ మూలములో రబ్బరు మొక్కలు పెంచితే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఆపారమైన విజయం సాధించడం పాటు ఆర్థిక శ్రేయస్సు కూడా కలుగుతుంది.. ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు వైపు కలబంద మొక్కలు పెంచాలి. ఇవి ప్రమాదకర వాయువులను పీల్చుకుంటుంది. ఇంటి అంతటా పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణ సంపద శ్రేయస్సు పెరగడానికి అనువైన వాతావరణం కలిగి ఉంటుంది..
Trees పెరట్లో మొక్కలకు వాస్తు సూచనలు
బోన్సాయ్: ఈ మొక్కలు ఇంటి యజమానికి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే వీటిని ఇంట్లో పెంచడం అసలు మంచిది కాదు.. ఇండోర్ ప్లాంట్స్ పెంచేవారు లివింగ్ రూమ్ లో తీగజాతి మొక్కలను కొండి మొక్కల్ని పెంచితే మంచిది. ఇవి రూమ్ ప్లేస్మెంట్స్ కు బాగా సెట్ అవుతాయి..
ముళ్ళ మొక్కల: ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచడం మంచిది కాదు. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటాయి. తోట మధ్యలో పెద్ద చెట్లు లేదా మొక్కలను పెంచడం అస్సలు మంచిది కాదు.. అవి బాగా గుబురిగా పెరిగి ఇతర మొక్కల్ని ఎదగకుండా చేస్తాయి.. ఆగ్నేయ లేదా నైరుతిలో మొక్కలు నాటడం గార్డెన్ చేయడం అసలు మంచిది కాదు. వీటి వలన ఆందోళన లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. పెరటి తోట ఒక క్రమ పద్ధతిలో ఉండాలి మొక్కల వరుసల మధ్యలో ఖాళీ స్థలం ఉండాలి. వాటిపై ఎండ ప్రవహించేలా చూసుకోవాలి. బెడ్ రూమ్ లో ఇండోర్ ప్లాంట్స్ పెంచవద్దు.. బడక గదిలో మనీ ప్లాంట్ తమలపాకులు లాంటి వాటిని అస్సలు పెంచకూడదు.. గార్డెనింగ్ కోసం ఇంటికి ఉత్తరం లేదా పడమర దిశ సరి అయింది. మొక్కలు పెంచడానికి ఇవి అనువైన ప్రదేశాలు..