Vastu Tips : ఈ వాస్తు టిప్ పాటిస్తే అపర కుబేరులు అవ్వడం ఖాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vastu Tips : ఈ వాస్తు టిప్ పాటిస్తే అపర కుబేరులు అవ్వడం ఖాయం…!!

Vastu Tips : చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు కొన్ని వాస్తుల ప్రకారంగా నిర్మిస్తూ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ధనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే దీనికి వాస్తు ప్రకారం గా కొన్ని మార్గాలు ఉన్నాయని ఋషులు చెప్తున్నారు. వాస్తు ప్రకారంగా ఇంటిని కట్టుకున్న లేదా ఇంటిని మార్చుకున్న ధనయోగం పట్టడం ఖాయమని చెప్తున్నారు. సొంత ఇల్లు అయినా ప్లాట్ అయిన చివరికి అద్దె ఇల్లు అయిన ఈ టిప్స్ ను పాటించడం వలన తప్పకుండా కుబేరులు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 December 2022,6:00 am

Vastu Tips : చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు కొన్ని వాస్తుల ప్రకారంగా నిర్మిస్తూ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ధనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే దీనికి వాస్తు ప్రకారం గా కొన్ని మార్గాలు ఉన్నాయని ఋషులు చెప్తున్నారు. వాస్తు ప్రకారంగా ఇంటిని కట్టుకున్న లేదా ఇంటిని మార్చుకున్న ధనయోగం పట్టడం ఖాయమని చెప్తున్నారు. సొంత ఇల్లు అయినా ప్లాట్ అయిన చివరికి అద్దె ఇల్లు అయిన ఈ టిప్స్ ను పాటించడం వలన తప్పకుండా కుబేరులు అవుతారని గ్రంథం తెలిపింది. అయితే ఈ గ్రంథంలో దీనికి సంబంధించిన ఎనిమిది ప్రధాన సూత్రాలను తెలపడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..

1)స్నానాలు గదులను కట్టేటప్పుడు వాస్తు పరంగా ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని నైరుతి దిశలో గనక నిర్మిస్తే ఆ ఇంట్లో విపరీతంగా ధన నష్టం జరుగుతుంది. ఇంట్లో దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో కాని కడితే ఆ ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది.
2)ఆగ్నేయ, ఈశాన్యం, మూలలో ఎలాంటి పరిస్థితిలోనూ ఓవర్ హెడ్ ట్యాంకులను కానీ వాటర్ హెడ్ ట్యాంకులను కానీ అసలు కట్టకూడదు.. ఈ విధంగా కట్టిన క్రమంలో పరిస్థితి క్షీణించిపోవడమే కాకుండా ఆ ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటుంది.

If you follow Vastu Tips you are sure to become an extra person

If you follow Vastu Tips you are sure to become an extra person

3) వాసు ప్రకారం వంటగదిలో కానీ స్నానాలు గదిలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఎక్కడ నీరు కారుతూ ఉంటే అక్కడ అంత నష్టమే జరుగుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఇంటి చూరు నుంచి నీరు కారణం కూడా మంచిది కాదు. అలాగే పైపులు విరుగుడు, గోడలు బీటలు వాటి నుంచి నీరు కారణం మొదలైతే వెంటనే వాటిని మరమ్మత్తులు చేయించుకోవాలి. లేదా ఆ ఇంట్లో వైద్య ఖర్చులు సంపద అంతా హరించకపోతుంది.

4) ఈశాన్యంలో చిన్నపాటి నీటి పాంటిన్ లేదా అక్వేరియంను ఏర్పాటు చేసుకుంటే ఆకష్మిక ధనయోగాలు పట్టడం ఖాయమని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ మూల నీరు ప్రవశిస్తూ ఉంటే అది ఆర్థికంగా మంచి చేస్తూ ఉంటుంది.

5) ఇక ఇంటికి ప్రధాన ద్వారం తలుపులు విరుగుడు, పగుళ్లు ,చీలికలు అస్సలు ఉండకూడదు. అది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేది ప్రధాన ద్వారం గుండానే అని తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రధాన ద్వారానికి ఎదురుగా పూల మొక్కలు, అందమైన బొమ్మలు ఉండడం సంపదకు సౌభాగ్యానికి చాలా మంచిది.

6) ఇంట్లో ఎక్కడ పాత వస్తువులు పోగు చేసి పెట్టడం ఆర్థికపరంగా అసలు మంచిది కాదు. ఏ దిక్కులోను పాత పర్మిచర్ పాత వస్తువులను విరిగిన వస్తువులు తగిలిన వస్తువులు ఉంచకూడదు. ప్రధానంగా మూలలో ఈ వస్తువును ఉంచకపోవడం చాలా మంచిది.

7) ధన యోగానికి సంబంధించిన నైరుతి మూలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ నైరుతి మూలను సవ్యంగా ఉపయోగించుకుంటే ఆ ఇంట్లో ధన ధాన్యాలకు కొదవ ఉండదని ఈ గ్రంథం తెలిపింది.

8) ఇంటి లోపలి భాగంలో ఉత్తర దిక్కులో గాని తూర్పు దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ కుబేర యంత్రాన్ని పెట్టుకోవడం ఆర్థికపరంగా చాలా మంచిది. భారతీయ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదకు ధనానికి అదృష్టానికి కారకుడు అవుతాడు. కాబట్టి కుబేరుడు ఉత్తర దిక్కును అధిపతి దానివల్ల ఉత్తర దిక్కులు కానీ ఈశాన్య దిక్కులో కానీ టాయిలెట్ ను చెప్పులు స్టాండ్ ను అస్సలు పెట్టకూడదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది