Ashada Masam : ఆషాడ మాసం.. స్నానం చేసేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే కోటీశ్వరులు అవుతారు ..!
Ashada masam : మన తెలుగు మాసాలలో ఆషాడ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని శూన్య మాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది. అలాగే ఈ మాసంలోనే కొత్తగా పెళ్లయిన వధువు తల్లి గారి ఇంటికి వస్తుంది. ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటలు కలుసుకోకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే ఈ మాసంలోనే మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఈ మాసంలో చేసే స్నానం మంచి యోగ ఫలాలను ఇస్తాయి. సముద్రం, నది స్నానాలు ముఖ్యమైనవి. ఆషాడ మాసంలో చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఆషాడమాసంలో ఆషాడ అమావాస్య రోజున పితృ కర్మలు నిర్వహించడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి.
పితృ దోషం ఉండడం వలన సంతాన సమస్యలు వస్తాయి. పుట్టిన బిడ్డలు మాట వినకపోవడం, వారు జీవితంలో ఎదగలేకపోవడం, బిడ్డలు కలగక పోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఆషాడ అమావాస్య రోజున పితృతర్పణ వదలాలి. అలా చేయడం ద్వారా మన పిత్రులు మనల్ని ఆశీర్వదిస్తారు. అయితే ఇంత విశిష్టత కలిగిన రోజున స్నానం చేసేటప్పుడు ఈ పనిని చేస్తే కోటీశ్వరులు అవుతారు. వీలైన వారు ఆషాడం మాసం మొదలైన రోజున సముద్ర లేదా నది , కొలనులో స్నానం చేయాలి. వీలు కాని వాళ్ళు గంగా జలాన్ని కొద్దిగా తీసుకొని స్నానం చేసేటప్పుడు కొద్దిగా బకెట్ లో వేసుకొని స్నానం చేయాలి.
అయితే ముందుగా గంగాజలాన్ని అరచేతిలో పోసుకొని బకెట్లో వేసి చిటికెన వేలుతో క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో 11 సార్లు తిప్పాలి. కలిపేటప్పుడు గంగమ్మ తల్లి పేరు జపిస్తూ ఉండాలి. దీంతో నీరు శుద్ధి అవుతుంది. మనకు పుణ్యఫలం లభిస్తుంది. ఈ నీటితో తలస్నానం చేసి పితృ కర్మలు చేస్తే మనకు ఎటువంటి దోషాలు ఉండవు. ఇలా చేయడం వలన మన పితృ దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇలా ఆషాడ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి చక్కని జీవితాన్ని పొందుతారు. కాబట్టి ఆషాడ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు ఈ చిన్న చిట్కాను పాటిస్తే కోటీశ్వరులు అవుతారు.