Astro Tips : ఈ చిన్న చిట్కాను పాటించారంటే.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి..
Astro Tips : చాలామంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు. ఎంత కష్టపడినా ఆర్థికంగా జీవితంలో స్థిరపడలేరు. ఏదో ఒక సమస్యలు, రోగాలు వస్తూనే ఉంటాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు కొనసాగుతూనే ఉంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాల వల్ల కావచ్చు. దాని వలన సమస్యలు, రోగాలు, గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి శాస్త్రాలలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. వీటిని పాటించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీంతో కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి పోవాలంటే ఎటువంటి చర్యలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొబ్బరికాయ ఇంట్లో ఉంచడం మంచిది.
కొబ్బరికాయ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని కొందరి నమ్మకం. కొబ్బరి కాయ లక్ష్మీదేవి రూపమని నమ్ముతారు. దీన్ని ఇంట్లో ఉంచడం వలన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఇంట్లో శంఖం ఉంటే శుభప్రదంగా పరిగణిస్తారు. శంఖం ఉన్న ఇళ్లలో వాస్తు దోషం ఉండదని కొందరు అంటుంటారు. శంఖం మహావిష్ణువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని శాస్త్రాలలో చెప్పబడింది. అందుకనే శంఖం ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో తో పాటు కుబేరుడి బొమ్మను ఎల్లప్పుడూ ఉంచాలి. లక్ష్మీదేవి సంపదకు దేవత, కుబేరుడు ఆదాయ దేవుడు. అందుకనే లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు ఏర్పాటు చేసుకోవడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వినాయకుడు పనిలో అడ్డంకులను తొలగించి శుభాలను ఇస్తాడని నమ్మకం.
ఎటువంటి శుభకార్యాలలో అయినా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఇంట్లో డబ్బు కొరత ఉంటే వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వలన మంచి జరుగుతుంది. అలాగే వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించుకోవడానికి వేణువు ఎంతో ప్రభావంవంతమైనదిగా పరిగణించబడుతుంది. హిందూమతంలో వేణువుకి ప్రత్యేక స్థానం ఉంది. వేణువు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. పూజ గదిలో వెదురు వేణువును ఉంచిన ఇంట్లో ఎల్లప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి. ఇంట్లో వేణువును ఉంచడం వలన వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అంతేకాదు నెమలి ఈక ఇంటి వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇంట్లో సంపాదన నిలుస్తుంది. ఖర్చులు తగ్గుతాయి.