
Astrological : మీ స్వప్నంలో ఇవి కనిపిస్తే... మీ కుటుంబానికి సర్ప దోషము ఉందని సంకేతం...?
Astrological : శాస్త్రంలో గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు పండితులు. అలాంటి, ప్రభావమే సర్ప దోషం. ఈ సర్ప దోషం ఏ జాతకంలో ఏర్పడుతుందో ఆ వ్యక్తి జీవితంలో అనుకొని అడ్డంకులు, కష్టాలను సృష్టిస్తుందని తరచూ చెబుతుంటారు పండితులు. సర్ప దోషమంటే ఏమిటి? జ్యోతిష్యపరంగా ఈ దోషాన్ని ఎలా దించాలి దీని సంకేతాలు ఏ విధంగా ఉంటాయో పూర్తిగా తెలుసుకుందాం. హిందూ ధర్మ శాస్త్రంలో పాములకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పాములను దేవతల రూపంగా కొలవబడతాయి. కొన్నిసార్లు జాతకంలో ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతాయని నమ్ముతారు. అటువంటిదే సర్పదోషం. ఒక వ్యక్తి జీవితం లో అనేక ఆటంకాలను, కష్టాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సర్ప దోషము ఎలా ఏర్పడుతుంది దీని సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం…
Astrological : మీ స్వప్నంలో ఇవి కనిపిస్తే… మీ కుటుంబానికి సర్ప దోషము ఉందని సంకేతం…?
పదేపదే పాములు కలలో కనిపించడం : కలలో పదే పదే పాములు కనిపిస్తే, అవి వెంటపడుతున్నట్లు లేదా చుట్టుముడుతున్నట్లు అనిపించితే సర్పదోషణానికి ముఖ్యమైన సంకేతం గా భావిస్తారు.
చనిపోయిన పాములు కనిపించడం : కలలో చనిపోయిన పాములు కనిపించినా లేదా పాములను చంపినట్లు అనిపించినా దోష ప్రభావం ఉండవచ్చని సూచిస్తుంది.
మానసిక ఆందోళన : నిరంతరం మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, ప్రశాంతత లేకపోవడం, చిన్నచిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించటం వంటివి కూడా సర్ప దోషానికి సంకేతాలు కావచ్చు.
అలసట, నిద్రలేమి తనం : ఎంత విశ్రాంతి తీసుకుంటున్న కూడా అలసటగా ఉండడం.నిద్ర పట్టకపోవడం లేదా రాత్రిపూట తరచూ భయంకరమైన కలలు రావడం. వంటివి సర్ప దోషాలకు సంకేతాలు.
వ్యక్తిగత జీవితంలో సమస్యలు :
వివాహం ఆలస్యం లేదా సమస్యలు : వివాహం జరగడం విషయంలో ఆలస్యం కావడం,సంబంధాలు బంధాలు కుదరకపోవడం. వివాహం జరిగిన వైవాహిక జీవితంలో తరచుగా కలహాలు అశాంతి కలగడం.
సంతాన సమస్యలు: సంతానం కలగకపోవడం, సంతానం ఆలస్యం కావడం, తరచుగా గర్భస్రావాలు జరగటం, పుట్టిన పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడం వంటివి కూడా సర్పదోషలకు సంకేతాలు.
కుటుంబ కలహాలు : కుటుంబసభ్యుల మధ్య సామరస్యంగా లేకపోవడం తరచుగా చిన్న చిన్న విషయాలపై గొడవలు విభేదాలు రావడం.
బంధుత్వ సమస్యలు : బందువులతో సత్సంబంధాలు లేకపోవడం లేదా వారి వల్ల సమస్యలు ఎదుర్కోవడం అంటే మీకు కూడా సర్ప దోషాలకు సంకేతాలు.
ఆర్థికపరమైన, సంకేతాలు
ఆర్థిక సమస్యలు : ఎంత కష్టపడినా కూడా ఆర్థికంగా నిలదొక్కు లేకపోవడం, నష్టాలు రావడం,అనవసరమైన ఖర్చులు, అప్పులు పెరగడం వంటివి సర్పదోష సంకేతాలు.
వృత్తిలో ఆటంకాలు : ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఆలస్యం, స్థిరత్వం లేకపోవడం, తరచూ ఉద్యోగాలు మారాల్సి రావడం, ఉద్యోగం కోల్పోవడం వంటివి, వ్యాపారాలలో నష్టాలను, ఎదుగుదల లేకపోవడం వంటివి కూడా కారణాలు కావచ్చు.
ఆరోగ్య సంబంధిత సంకేతాలు
తరచూ అనారోగ్యాలు కలగడం : ఒక వ్యాధి తగ్గిన వెంటనే మరొకటి రావటం, దీర్ఘకాలిక వ్యాధులు, సరైన చికిత్సకు కూడా తగ్గని ఆరోగ్య సమస్యలు.
అకస్మాత్తుగా ప్రమాదాలు : ఊహించని ప్రమాదాలు గాయాలు లేదా సంఘటనలు జరగటం వంటివి సంకేతాలు కావచ్చు. ఈ సంకేతాలు కేవలం జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. మీకు పైన తెలియజేసిన విషయాలపై ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, మొదట వైద్యులను సంప్రదించటం ముఖ్యం. తర్వాత,జ్యోతిష్య పరమైన సందేహాలకు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి, మీ జాతకాలని పరిశీలించుకుని, తగిన సూచనలను పాటిస్తే నివారణ చర్యలను తీసుకుంటే ఉత్తమం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.