
Allu Arjun : అవమానాలు పొందిన వారితోనే అవార్డులు.. పుష్పరాజా మజాకా...!
Allu Arjun : సినీ ప్రపంచంలో విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలో బన్నీ చూపించిన నటనకు తాజాగా గద్దర్ అవార్డు లభించిందంటే, అది ఒక గొప్ప గుర్తింపుగా భావించవచ్చు. స్మగ్లింగ్ నేపథ్య కథ, ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే సంభాషణలు ఈ పాత్రకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అల్లు అర్జున్ పాత్రలో లీనమై, ఒక సరికొత్త కోణంలో కనిపించిన తీరు ప్రేక్షకులనే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.
అయితే ఈ పాత్రకు గతంలో వివాదాలు కూడా వచ్చాయి. ఒక స్మగ్లర్ ను. ప్రోత్సహించడమా? అనే ప్రశ్నలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు ‘సంధ్య థియేటర్’ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. దీంతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, ఒక రోజు జైలు జీవితాన్ని కూడా ఎదుర్కొన్న సందర్భం ఉంది…
Allu Arjun : అవమానాలు పొందిన వారితోనే అవార్డులు.. పుష్పరాజా మజాకా…!
ఆ సమయంలో ఈ సినిమా చుట్టూ పలువిధాలుగా నెగెటివ్ ప్రచారం జరిగినప్పటికీ, బన్నీ తాను పోషించిన పాత్రను నిజాయితీగా సమర్పించారు. ఇక ఇప్పుడు గద్దర్ అవార్డు అందుకోవడం ద్వారా ఆ విమర్శలన్నింటికి సమాధానమిచ్చినట్లైంది. ఏది ఏమైనప్పటికి బన్నీ కి గద్దర్ అవార్డు రావడం అనేది సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే ఓ వర్గం ప్రజలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం తరపున సినీ అవార్డులు ప్రకటించడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల పేరిట ప్రతి ఏడాది అవార్డులు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. అయితే గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవార్డుల గురించి ఎలాంటి చర్చ జరగకపోవడంతో ఈ ప్రకటన మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా “గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్” పేరిట అవార్డులను ప్రకటిస్తూ, ప్రముఖ నటి జయసుధ ఆధ్వర్యంలో జ్యూరీ కమిటీ ఏర్పాటు చేసి విజేతలను ఖరారు చేసింది.
ఈ అవార్డుల్లో అందరికీ ఎక్కువగా ఆకర్షించిన అవార్డు మాత్రం అల్లు అర్జున్‌కు “పుష్ప 2” చిత్రానికి లభించిన ఉత్తమ నటుడు అవార్డే. ఇప్పటికే పుష్ప సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్‌కు ఇది మరో గౌరవం. అయితే ఈ అవార్డు ప్రకటనతో పాటు గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. ఆ ఘటనలో ఒక మహిళ మృతిచెందడం, చిన్నారి శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం వల్ల అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి చంచలగూడ జైలులో ఒక రాత్రి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వ నిర్ణయం అప్పట్లో తీవ్ర దుమారాన్నే రేపింది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే అవార్డును అల్లు అర్జున్ స్వీకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. జూన్ 14న నిర్వహించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి ఆయన హాజరవుతారా? అనే అంశంపై టాలీవుడ్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
ఇదిలా ఉంటె అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు ప్రకటించడం పై పలు విమర్శలు వస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్ పై కేసులు పెట్టడం , విమర్శలు చేయడం , పుష్ప రాజ్ పాత్ర పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం మళ్లీ ఎలా అల్లు అర్జున్ కు అవార్డు ఇచ్చిందని కొంతమంది విమర్శిస్తుంటే..ఆ అవార్డు కు అర్హత పొందే వ్యక్తి అల్లు అర్జునే అని ఆయన అభిమానులు అంటున్నారు. కావాలని చేయకున్నా తప్పు తన వైపు ఉంది కాబట్టి జైలు కు వెళ్లాడని , సదరు మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకున్నాడని, హాస్పటల్ లో చికిత్స పొందుతున్న బాలుడికి సైతం ఆర్ధికంగా చేయూత ఇచ్చాడని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి అల్లు అర్జున్ కు గద్దర్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.