శనిదోషాలతో ఇబ్బందా.. ఈ పనులు చేస్తే అంతా శ్రేయస్కరమే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తికి సంబంధించిన జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే అతడిని దురదృష్టం వెంటాడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శని దేవుడి దయ లేకుంటే ఎవరి జీవితంలోనైనా.. విజయం అనే పదం కనిపించదు. ఎప్పుడు అపజయాలే ఎదురవుతాయి. అనేక సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. శని వక్ర దృష్టి కారణంగా అన్ని పనులు నష్టాన్నే తెచ్చి పెడతాయి. శని గ్రహం ఎల్లప్పుడూ వారి కర్మ ప్రకారమే ఫలాలను ఇస్తుంది. జాతకంలో శనికి సంబంధించిన దోషం ఉంటే అస్సలు భయమే వద్దు. ఎందుకంటే శని దేవుడిని అనుగ్రహం పొందడానికి జ్యోతిష్య పరిహారాలని చేస్తే సరిపోతుంది. కానీ శని దోష పరిహారాలు చేసే సమయంలో భక్తి శ్రద్దలతో చేయాలి.శని దేవుడు తొమ్మిది గ్రహాలలో ఒకడు. సాధారణంగా శని దేవుడిని కర్మను ఇచ్చేవాడు అని పురాణాల్లో ఉంటుంది.
శని దేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుందని పండితులు చెబుతారు. అతడి రంగు నల్లగా ఉంటుంది. ఆలయాలలో కూడా శని దేవుడి విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది. శని దేవుడికి ఇష్టమైన రంగు కూడా నలుపే. నల్లటి నువ్వులు, నల్లటి దుస్తులు, నల్లటి వస్తువులు శని దేవునికి సమర్పిస్తారు. దీంతో శని దేవుడు సంతోషించి తన భక్తులకు ఆశీర్వాదం అందజేస్తాడని నమ్మకం. శని సంబంధిత దోషాలను తొలగించడానికి మన దగ్గర పని చేసే సేవకులను వీలైనంత సంతోషంగా ఉంచాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరికీ బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. అంతే కాదు ఎవరి నుంచి అలాంటి బహుమతి తీసుకోకూడదు. మరిచిపోయి కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

astrological remedies remove the inauspiciousness of saturn
శని దోషంతో బాధపడుతున్న వారు అయితే శనివారం శని దేవాలయానికి వెళ్లి మీ బూట్లు లేదా చెప్పులు వదిలి ఇంటికి తిరిగి రావాలి.ఈ చిన్న చిట్కా పాటంచిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగే దీని గురించి ఎక్కడా చర్చించకూడదు. జాతకంలో శని దోషం ఉంటే దానిని తొలగించడానికి రావిచెట్టుని ఆరాధించాలి. శనివారం రావిచెట్టుని పూజించడం ద్వారా శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. శనికి సంబంధించిన అన్ని కష్టాలు త్వరగా తొలగిపోతాయని నమ్ముతారు. పూజలలో నలుపు రంగుకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఈ కారణంగా శనిదేవుడు నలుపును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు. అప్పటి నుంచి శని దేవుడికి నలుపు రంగు వస్తువులను సమర్పించడం ప్రారంభమైంది. దీంతో శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇది కాకుండా మీరు ఎవరికైనా పేద, నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయి.