Dhanu Rasi : సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశి వారికిి అద్భుత ఫలితాలు… ఈ పరిహారాలు తప్పక పాటించండి…!
ప్రధానాంశాలు:
Dhanu Rasi : సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశి వారికిి అద్భుత ఫలితాలు... ఈ పరిహారాలు తప్పక పాటించండి...!
Dhanu Rasi : ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది.? అలాగే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది..? వీరి జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి.? వీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపదా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదం కింద జన్మించిన వారిది ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు రాశి వారికి ఈ నెల అదృష్టం కలిసి వస్తుంది. చేసే పనిలో రానిస్తారు. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. మీ పని తీరు బట్టి ప్రశంషలు అందుకుంటారు. వ్యాపారులు తమ పనులు విస్తరించి లాభాలను పొందుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు. శత్రువులపై ఆదిపత్యం సాధిస్తారు. వీరి పనులన్నీ సకాలంలో పూర్తీ అవుతాయి. వీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం ద్వారా భవిష్యత్తులో మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
ధనస్సు రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెళ్లి సంబంధాల గురించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దీనివల్ల వీరికి ఊరట లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా మంచి విజయాలను అందుకుంటారు. అలాగే పని భారం ఒత్తిడిని కలిగి కూడా ఉంటారు. అదే సమయంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఈ వారం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ నెల ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ పరంగా జీవిత భాగ్యస్వామి నుంచి మంచి మద్దతు ఉన్నందున వీరికి బాగుంటుంది. వీరి పిల్లలలో ఒకరికి ఆరోగ్యం సమస్యలు ఉంటాయి. అష్టమ స్థానంలో ఉన్న రవి శుక్రుడి వలన అనవసరపు ఖర్చులు పెరగడం తరచూ విమర్శలకు గురికావడం జరుగుతుంది.
Dhanu Rasi పరిహారాలు
ఆదిత్య హృదయ స్తోత్రం, ఇతర సూత్రాలు , ఆదివారం , సప్తమి తిధులు లేదా మంచి రోజుల్లో చదవండి. ఎరుపు దారంతో చేసిన వెండి లేదా రాగితో చేసిన దుర్గ దేవి బిల్లను ధరించండి. ప్రతిరోజు సూర్యుడికి నీటిని సమర్పించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని నల్ల దుప్పట్లకు పేదవారికి పంచండి. వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వలన మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.