Karkataka Rasi : గురు పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో పెను మార్పులు…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 18, 2024, 12:00 pm
  •  Karkataka Rasi : గురు పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో పెను మార్పులు...!

Karkataka Rasi : కర్కాటక రాశి వారికి గురు పౌర్ణమి తర్వాత వారి జీవితంలోకి దూసుకు వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి…? అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందా…? వీరి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.జులై నెల ఆఖరిలో వ్యాపారం అభివృద్ధి చెందే విధంగా వీరి ఆలోచన కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో పూర్వ రుణములు కొన్ని తీరుతాయి. గతంలో వీరికి ఇచ్చిన లేదా వీరు ఇచ్చిన రుణ బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అనవసరమైన విషయాల నుంచి బయటపడతారు. దైవారాధన దైవభక్తి అపారంగా కలిగి ఉంటారు. అలాగే రానున్నటువంటి పుణ్యమాసాలలో మరిన్ని దివ్య క్షేత్రాలను కర్కాటక రాశి వారు సందర్శిస్తారు. గురుభక్తితో అపారమైన సేవలను చేయడానికి మీ మనసు ఆరాటపడుతుంది. మాసానంతరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక సిరత్వాన్ని ఇస్తాయి.

ఆర్థిక లాభాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో గొడవలు పడకూడదు. ఒకవేళ భార్యను తులా రాశి అయ్యి భర్తది కర్కాటక రాశి అయితే లేదా భార్య కర్కాటక రాశి అయ్యి భర్త మేష రాశి వాడు అయితే తప్పనిసరిగా ఎవరో ఒకరు ఒక చోట తగ్గండి. మీకు జరిగినటువంటి సంభాషణలను ఇతరులతో పంచుకుని చులకన కాకండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన యోగం ఉన్నది. అలాగే వీరికి జూలై మాసంలో అవకాశాలు కలిసి వస్తాయి. దీని ద్వారా ప్రణాళికను రూపొందించుకుంటారు. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. నగదు చెల్లింపుల స్వీకరణలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. వారం మధ్యలో విద్యార్థులకు దూర ప్రదేశాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి పొదుపు చేసుకోవడం మంచిది.

Karkataka Rasi : గురు పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో పెను మార్పులు...!

Karkataka Rasi : గురు పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో పెను మార్పులు…!

Karkataka Rasi పరిహారాలు

గోవులను ప్రేమించండి అలాగే గోవులను పూజించండి. గోపూజ గోదర్శనము శనివారం పూట అన్నదానం చేయడం వలన తప్పనిసరిగా సత్ఫలితాలను జులై మాసంలో కర్కాటక రాశి వారికి ఇస్తాయి. అలాగే గోశాలలో సేవలు చేయండి. ఈనెల శుభ ఫలితాల కోసం కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా ను పాటించడం ద్వారా సమస్యల నుంచి బయటపడతారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp