Home » Devotional » Astrology Of Makara Rasi August 2024
Devotional

Makara Rasi : ఆగస్టు నెలలో మకర రాశి వారి జీవితం మారబోతుంది..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 26, 2024, 12:00 pm
Advertisement

Makara Rasi : మకర రాశి జన్మ నక్షత్రం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు లేదా శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారిది మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుంది..? అలాగే వీరి లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగష్టు నెలలో కొన్ని శుభ యోగాలు పట్టబోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతి పని కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న అనుకున్న పనులు కొన్ని నెరవేరి సంతృప్తి పరుస్తాయి. ఆస్తుల కొనుగోలు విషయంలో ఆసక్తి చూపుతారు. అలాగే ఆర్థిక లావాదేవులకు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వైద్యుల హాయంలో కోలుకుంటారు. అలాగే వీరి ఆదాయం పెరుగుతుంది. కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మకర రాశి వారు వర్క్ ప్లేస్ మీ సామర్థ్యం కంటే ఎక్కువగాని చేయడం దీనికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

వివిధ విషయాలు పై దృష్టి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సైన్స్ ఐటి విద్యార్థులు రాణిస్తారు. వివిధ కళాలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు సామాజిక రంగం వాళ్ళు న్యాయవాదులు అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ వాహన యోగాలుకు అవకాశం ఉంది. విద్యా వ్యాపారస్తులు ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అంతేకాకుండా వీరు మంచి నాయకులయ్యే అవకాశం ఉంది. మకర రాశి వారు మంచి న్యాయవాదులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే మీ వ్యాపారం మెరుగుపరడం కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు వీరికి మంచి సలహాలను ఇస్తారు. విదేశాలలో ఉద్యోగం పొందే అవకాశాన్ని పొందవచ్చు.

అయితే వీరు కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవచ్చు. ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం ఆదాయం బాగుంటుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అదనపు ఆదాయ వనరులను ఎదుర్కోవడంలో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రువులపై చేయి సాధిస్తారు. మకర రాశి వారికి వివాహ పరంగా మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొందరు వ్యక్తులు అనుకూలమైన ఫలితాలను అనుభవించవచ్చు. మరికొందరు వారి వైవాహ జీవితంలో సవాలను ఎదుర్కొనవచ్చు. వ్యక్తిగత జీవితంలో వృద్ధి పురోగతికి అవకాశాలు వస్తాయి. ఇది మీ భాగస్వామితో సంబంధాలను మెరుగుపరుస్తుంది. మకర రాశి వారు వివాహానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుపోవడం మంచిది. మీ భాగస్వామితో బంధం బలోపేతం చేయవచ్చు.

Advertisement

Makara Rasi : ఆగస్టు నెలలో మకర రాశి వారి జీవితం మారబోతుంది..!

Makara Rasi  పరిహారాలు

ప్రతికూల ప్రభావాలు భరించలేనట్లయితే శని దేవాయాలను సందర్శించి శనికి కైలాభిషేకం చేయించండి. మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం. హనుమాన్ చాలీసా పారాయణం వీరికి ప్రయోజనం చేకూరుస్తాయి. శివుని ఆరాధించడం వలన సమస్యల నుంచి బయటపడవచ్చు. కష్టేఫలి అనే సూత్రాన్ని నమ్ముకుని ఉండండి. విష్ణు సహస్రనామం పఠించడం. ఇతర విష్ణు నామాలను పట్టించడం శ్రీమహావిష్ణువుని పూజించడం ప్రతిరోజు సూర్యుడికి నీటిని సమర్పించండి. దీని ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి