RRB Jobs : తాజాగా భారతీయ రైల్వేలో మొత్తం 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..? విద్యార్హత ఏంటి..?ఎలా అప్లై చేసుకోవాలి..?దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 7,951 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో కెమికల్ సూపర్వైజర్ మరియు రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ / రీసెర్చ్ – 13 పోస్టులు..
జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ – 7,934 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునేవారు డిప్లమా లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.
ఇక దీనిలో బిసిఏ / బీటెక్ పూర్తి చేసిన వారు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అలాగే డిప్లమా పూర్తి చేసిన వారు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్న వారు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 36 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST లకు 5 సంవత్సరాలు OBC లకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
వేతనం..
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రతి నెల రూ.35,400 జీతం గా ఇవ్వబడుతుంది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఇతర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
ఎలా దరఖాస్తు చేయాలి..
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు అప్లై చేయాలి అని ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదుచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రుసుము…
సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఓబీసీ – 500
మహిళలు మరియు SC/ST – 250
పరీక్ష విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుంది.
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
This website uses cookies.