Tula Rashi : జులై నెలలో తులారాశి వారికి ఎదురుకాబోయే కష్టాలు… ఈ పరిహారాలు పాటిస్తే మంచిది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tula Rashi : జులై నెలలో తులారాశి వారికి ఎదురుకాబోయే కష్టాలు… ఈ పరిహారాలు పాటిస్తే మంచిది…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 June 2024,8:00 am

Tula Rashi : జులై నెలలో తులా రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది…? వీరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి…? వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు విశాఖ నక్షత్రం ఒక్కటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారిది తులా రాశి అవుతుంది. తులారాశి వారు ఈ నెలలో మేధావులుగా గుర్తింపు పొందుతారు. ప్రజా ఆకర్షణ ఉంటుంది. ప్రజలకు సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు .ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. సిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీయానం లభిస్తుంది. ఆత్మీయులు బంధువులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. పడమర దక్షిణ దిక్కులు లాబిస్తాయి. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఎవరికైనా పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వలన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టడానికి సహాయం అవసరం కావచ్చు. అలాగే పరీక్షల్లో కానీ ఉద్యోగాలలో గాని తొందరపాటు తో ఉండకూడదు. ఉద్యోగపరంగా చూస్తే నెలలో నిర్దిష్ట సవాల్ ని అందిస్తుంది. అధికారులతో అపార్ధాలను ఎదుర్కొంటారు. తులారాశి ఉద్యోగులకు అన్ని రకాల ఫలితాలు ఉంటాయి. అలాగే తుల రాశిలో వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వీరి జీవిత భాగ్యస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిర్లక్ష్యం అనర్ధాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. క్రమేపీ ఎదుగుదల కొంత అవకాశాన్ని కల్పిస్తాయి. తుల రాశి వారికి జూలై నెలలో కొన్ని ఇబ్బందులు ఆందోళన కలిగించే విషయాలు ఉన్నప్పటికీ వీరి విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయక సహకారాలు లభిస్తాయి. ఈ సమయంలో కెరియర్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా తీసుకువెళ్లాలి అంటే ఈనెల ఆఖరి వరకు ఆగాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభం నుంచి సకాలంలో పూర్తి చేస్తారు.

Tula Rashi జులై నెలలో తులారాశి వారికి ఎదురుకాబోయే కష్టాలు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది

Tula Rashi : జులై నెలలో తులారాశి వారికి ఎదురుకాబోయే కష్టాలు… ఈ పరిహారాలు పాటిస్తే మంచిది…!

Tula Rashi పరిహారాలు..

శనివారం రోజు శని దేవాలయానికి వెళ్లి నల్లని శనగలు ప్రసాదం గా నువ్వులు బెల్లం కలిపి తయారుచేసిన తీపి వంటకం పంచి పెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమపిండిని ఆరుబయట చల్లండి. ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వలన శుభ ఫలితాలను పొందుతారు గోమాత సేవలో కొంత సమయం గడపడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది